Suspicious Death : మహిళ మృతి.. హెడ్ కానిస్టేబుల్‌పై అనుమానాలు

హెడ్ కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ మహిళ ఉరి వేసుకున్న స్థితిలో అనుమానాస్పదంగా మృతి చెందింది.

Suspicious Death : మహిళ మృతి.. హెడ్ కానిస్టేబుల్‌పై అనుమానాలు

Suspicious Death

Updated On : November 24, 2021 / 9:00 AM IST

Suspicious Death :  మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కర్ణాటక రాష్ట్రం శిడ్లఘట్ట పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని మారమ్మ దేవాలయం సర్కిల్ లో నివాసం ఉంటున్న రాజేశ్వరి (35) అనే మహిళ మంగళవారం ఉరివేసుకున్న స్థితిలో అనుమానాస్పదంగా మృతిచెంది ఉంది. ఆమెను గమనించిన భర్త వెంకటేష్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

చదవండి : Tamilnadu SI Murder Case : వదిలేయమని బతిమలాడినా కనికరించలేదు… అందుకే చంపేసాం

అయితే రాజేశ్వరికి శిడ్లఘట్టలోనే విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ అనంత్ కుమార్ కి మధ్య గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. వీరిద్దరి మధ్య ఈ నెల 21వ తేదీన గొడవ జరిగింది. ఇంతలోనే రాజేశ్వరి శవమై కనిపించడం పలు అనుమానాలకు తావిస్తుంది.

చదవండి : SI Murder : నడి రోడ్డుపై ఎస్ఐని దారుణంగా నరికి చంపిన దొంగల ముఠా

తన భార్యను అనంత్‌ కుమారే హత్య చేశాడని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు అనంత్‌కుమార్‌ పరారీలో ఉన్నాడు. దోషుల్ని శిక్షించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.