‘నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు ఓ ప్రాణం బలైంది’ అంటూ.. వీడియో పోస్ట్ చేసిన సజ్జనార్

రోడ్లపైకి వాహనాలతో వచ్చి ఇష్టారీతిన నడుపుతూ అమాయకుల ప్రాణాలు తీయడం..

‘నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు ఓ ప్రాణం బలైంది’ అంటూ.. వీడియో పోస్ట్ చేసిన సజ్జనార్

రోడ్డు పక్క నుంచి ఎంతో జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ ఓ వృద్ధుడిని ఢీ కొట్టింది ఓ కారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఆ వృద్ధుడి ప్రాణం తీసిన ఆ కారు డ్రైవర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.

‘నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు ఓ ప్రాణం బలైంది. కారుతో పాదచారుడిని ఢీకొట్టి కనీసం మానవత్వం లేకుండా తనకేం పట్టనట్టుగా వెళ్లిపోయారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఇవాళ జరిగిన ఈ ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందారు. రోడ్లపైకి వాహనాలతో వచ్చి ఇష్టారీతిన నడుపుతూ అమాయకుల ప్రాణాలు తీయడం ఎంత వరకు సమంజసం?’ అని సజ్జనార్ ప్రశ్నించారు.

Also Read: CM Revanth Reddy : సినిమా రంగంపై సీఎం రేవంత్‎రెడ్డి కీలక వ్యాఖ్యలు

వాహనాలు నడిపే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎటో ఆలోచిస్తూ, మొబైల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తుంటారు కొందరు. వారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా అమాయకుల ప్రాణాలకూ ముప్పు తెచ్చిపెడుతుంటారు.