Kidnapping Drama : జూబ్లీహిల్స్ లో ప్రేమజంట కిడ్నాప్ డ్రామా

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రేమజంట కిడ్నాప్ డ్రామా అని తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఇరువర్గాల బందువులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

Kidnapping Drama : జూబ్లీహిల్స్ లో ప్రేమజంట కిడ్నాప్ డ్రామా

Jubilee Hills

Updated On : February 18, 2023 / 2:54 PM IST

Kidnapping Drama : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రేమజంట కిడ్నాప్ డ్రామా అని తేలింది. విజయవాడ సమీపంలో గల మండలవారిపేట గ్రామానికి చెందిన ఒక అబ్బాయి (23 ఏళ్ళు ), అమ్మాయి (20 ఏళ్ళు) కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. అయితే నిన్న (శుక్రవారం) మధ్యాహ్నం తరువాత ప్రేమజంట ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ కు వచ్చారు.

నగరంలోని యూసుఫ్ గూడాలో ఉన్న అబ్బాయి అన్న ఇంటికి వచ్చారు. వీరి ఆచూకీ తెలుసుకున్న ఇరువురి బంధువులు యూసుఫ్ గూడా వస్తున్నారని తెలుసుకున్న ప్రేమ జంట జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఇరువర్గాల బందువులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. దీంతో ప్రేమజంట కిడ్నాప్ కాదని.. డ్రామా అని తేలింది.