కరోనా బాధితులకు TIKTOK విరాళం

COVID-19 రోజురోజుకి మరింత వ్యాప్తిచెందుతుంది. ఏపీలో మరో 24 మందికి కరోనా పాజిటివ్ తేలిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 111కు చేరింది. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు, డాక్టర్లకు టిక్‌టాక్ భారీ విరాళం ప్రకటించింది. 4లక్షల సూట్‌లు, 2లక్షల మాస్కులు ఇవ్వడానికి సిద్ధమైంది.
వారు ఇచ్చే మెడికల్ ఎక్విప్మెంట్ ఖర్చు సుమారు వంద కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. కరోనాను ఎదుర్కొనేందుకు డాక్టర్లు, సహాయక వైద్య సిబ్బంది పోరాటం చేస్తున్నారని. అందుకే వారు సురక్షితంగా ఉండటం అవసరమని టిక్‌టాక్ ఒక ప్రకటనలో తెలిపింది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఈ విరాళం ద్వారా మేము అందులో భాగంగా ఉండాలని అనుకుంటున్నామని తెలిపారు. కేంద్ర వస్త్ర మంత్రిత్వ శాఖ సహకారంతో తాము నిర్ణీత ప్రమాణాలతో కూడిన సూట్లు, మాస్కులు సిద్ధం చేశామని, వీటిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అందజేయనున్నామని టిక్‌టాక్ కంపెనీ తెలిపింది.
Also Read | భారీగా పెంచేశారు.. బీరు ధర రూ.350