hyderabad drugs : టోనీ విచారణ 2వ రోజు విచారణ.. కీలకంగా మారిన ఫోన్
ఎన్ఆర్ఐ వ్యాపారి చలసాని వెంకట్ మొబైల్ తో పాటు టోనీ మొబైల్ డేటాపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరి మధ్యలో జరిగిన డ్రగ్స్ డీలింగ్ పై అధ్యయనం చేయనున్నారు. వీరి వద్ద లభించిన 2.0...

Tony
Drug Peddler Tony : డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న టోనీని కస్టడీలో భాగంగా రెండో రోజు విచారించనున్నారు పోలీసులు. ఇందుకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. 2022, జనవరి 30వ తేదీ ఆదివారం పంజాగుట్ట పీఎస్ కు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు, నార్త్ జోన్ ఇన్స్ పెక్టర్ నాగేశ్వరరావు చేరుకున్నారు. ముంబైకి వెళ్లిన టాస్క్ ఫోర్స్ బృందం టోనీ గ్యాంగ్ ను పట్టుకుంది. రెండో రోజు జరిగే విచారణలో టోనీ ఫోన్ నెంబర్ కీలకంగా మారింది. ఎన్ఆర్ఐ వ్యాపారి చలసాని వెంకట్ మొబైల్ తో పాటు టోనీ మొబైల్ డేటాపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరి మధ్యలో జరిగిన డ్రగ్స్ డీలింగ్ పై అధ్యయనం చేయనున్నారు. వీరి వద్ద లభించిన 2.0 టీబీ డేటా విశ్లేషణ కోసం 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పలువురి వ్యాపారవేత్తల ఫొటోలు, ఫోన్ నెంబర్స్, చాటింగ్స్ డేటాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. టెక్నికల్ ఆధారాలను టోనీ ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Read More : Madhya Pradesh : బెదిరింపులకు లొంగని దళిత కుటుంబం, పోలీసు పహారాలో పెళ్లి ఊరేగింపు
శనివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ గణేశ్, సీఐ నిరంజన్‌రెడ్డి అండ్ టీమ్ నేతృత్వంలో విచారణ జరిగింది. టోనీ ముందు పూర్తి ఆధారాలతో విచారణ అధికారులు 5 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రశ్నలకు స్మగ్లర్ టోనీ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అతడికి నగరంలో ఎంతమంది వినియోగదారులు ఉన్నారు..? వారికి ఎంత కాలం నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు..? వంటి అంశాలపై ప్రశ్నలను అడిగారు. అతడి ఫోన్ కాంటాక్ట్స్‌తో పాటు బ్యాంక్‌లకు సంబంధించిన లావాదేవీలపై కూడా ఆరా తీశారు. టోనీకి హైదరాబాద్‌లో వ్యాపారులు వినియోగదారులుగా ఎలా పరిచయమయ్యారు..?
Read More : Parliament Session : పార్లమెంట్ సమావేశాలు.. షెడ్యూల్ ఇదే
వారికి మధ్యవర్తిగా ఎవరు ఉన్నారు..? డ్రగ్స్ తీసుకున్న తర్వాత మత్తు బాబులు నగదును ఎలా చెల్లించే వారు..? వీరి ఫోన్ సంభాషణలు ఎలా జరిగేవి వంటి ప్రశ్నలతో జవాబులను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. టోనీ ఆంగ్లంలో స్పష్టంగా మాట్లాడుతుండటంతో ప్రశ్నలను ఇంగ్లిష్‌లోనే అడిగారు. ఇంకా నాలుగు రోజుల పాటు గడువు ఉండడంతో పక్కా సాక్ష్యాధారాలు సేకరణకే ప్రాధాన్యమిస్తున్నారు. నిందితులకు శిక్షలు పడేలా విచారణను పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. టోనీ చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉందనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరి రెండో రోజు జరిగే విచారణలో టోనీ ఎలాంటి కీలక అంశాలు వెల్లడించనున్నాడో చూడాలి.