Madhya Pradesh : బెదిరింపులకు లొంగని దళిత కుటుంబం, పోలీసు పహారాలో పెళ్లి ఊరేగింపు

ధ్యప్రదేశ్‌లో గూండాల బెదిరింపులకు లొంగకుండా పెళ్లిని వైభవంగా చేసింది ఓ దళిత కుటుంబం. వ‌రుడిని గుర్రంపై ఊరేగిస్తే ఏడాది కాలం పాటు గ్రామం నుంచి బ‌హిష్కరిస్తామ‌ని కొందరు హెచ్చరించారు.

Madhya Pradesh : బెదిరింపులకు లొంగని దళిత కుటుంబం, పోలీసు పహారాలో పెళ్లి ఊరేగింపు

Madhyapradesh

Updated On : January 30, 2022 / 1:30 PM IST

Madhya Pradesh Dalit Groom : ప్రపంచంలో పరిస్థితులు శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టెక్నాలజీలో దూసుకపోతోంది. కొత్త కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయినా.. కొంతమంది తలరాత మాత్రం మారడం లేదు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా..విద్యా పరంగా..ఎన్నో రకాలు వారు వివక్ష ఎదుర్కొంటున్నారు. వారే దళితులు. వారి మేలు కోసం చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా.. అక్కడక్కడ వారిపై వివక్ష కొనసాగుతూనే ఉంది. పెద్దలు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోలేదని దళితులను గ్రామం నుంచి బహిష్కరించడం, ఇతరత్రా శిక్షలు వేస్తున్న ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా..ఓ ఇంట్లో జరుగుతున్న వివాహంపై పలు ఆంక్షలు విధించారు కొంతమంది గూండాలు. అయినా వారు బెదరకుండా.. పోలీసులను ఆశ్రయించి వివాహం జరిపించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More : Parliament Session : పార్లమెంట్ సమావేశాలు.. షెడ్యూల్ ఇదే

మధ్యప్రదేశ్‌లో గూండాల బెదిరింపులకు లొంగకుండా పెళ్లిని వైభవంగా చేసింది ఓ దళిత కుటుంబం. వ‌రుడిని గుర్రంపై ఊరేగిస్తే ఏడాది కాలం పాటు గ్రామం నుంచి బ‌హిష్కరిస్తామ‌ని కొందరు హెచ్చరించారు. అయినా వారు బెదరలేదు. పెళ్లి కొడుకు కుటుంబసభ్యులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. వెంటనే వారు చర్యలు తీసుకున్నారు. దీంతో ఎలాంటి సమస్యలు లేకుండా పెళ్లి వేడుక జరిగింది. మ‌ధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా స‌ర్సి గ్రామానికి చెందిన రాహుల్ మేఘ్వాల్ జ‌న‌వ‌రి 27న పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. అయితే పెళ్లిని ఘ‌నంగా నిర్వహించొద్దని, గుర్రపు స్వారీ చేయొద్దని గూండాలు ఆదేశించారు.

Read More : New Smart Phone: Flipkartలో మైక్రోమ్యాక్స్ IN Note 2 సేల్ ప్రారంభం

ఒక‌వేళ నిర్వహిస్తే ఏడాది కాలం పాటు గ్రామం నుంచి బ‌హిష్కరిస్తామ‌ని హెచ్చరించారు. దీంతో రాహుల్, ఆయ‌న తండ్రి జిల్లా క‌లెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. త‌మ కుమారుడి వివాహానికి ర‌క్షణ క‌ల్పించాల‌ని రాహుల్ తండ్రి ఫ‌కీర్‌చంద్ మేఘ్వాల్ అధికారుల‌కు విజ్ఞప్తి చేశాడు. దీంతో క‌లెక్టర్ స్పందించి.. రాహుల్ పెళ్లికి ర‌క్షణ క‌ల్పించాల‌ని పోలీసులను ఆదేశించారు.
ఇక మూడు పోలీసు స్టేష‌న్ల పోలీసులు రాహుల్ పెళ్లికి ర‌క్షణ క‌ల్పించారు. డీజే సౌండ్లు, డ్యాన్సుల మ‌ధ్య గుర్రంపై వ‌రుడిని ఊరేగించారు. 100మంది పోలీసుల పహారాలో పెళ్లికుమారుడి ఊరేగింపు జరిగింది. పెళ్లి కుమారుడు రాహుల్ గుర్రంపై వెళ్తున్న స‌మ‌యంలో త‌న చేతిలో అంబేద్కర్ ర‌చించిన భార‌త రాజ్యాంగాన్ని ఉంచి ప్రద‌ర్శించారు.