గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్.. బ్యూటీఫుల్‌గా అమ్మాయితో ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్.. తెల్లారితే పెండ్లి.. ఇంతలోనే..
జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తెల్లారితే పెండ్లి పీఠలెక్కాల్సిన వరుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Tragic incident in Jagtial district
Jagtial district: తెల్లారితే పెండ్లి.. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉన్నారు. పెండ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. వరుడు, వధువు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా వరుడు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆదివారం ఉదయం 10గంటలకు పెండ్లి పీఠలపై కూర్చోవాల్సిన వరుడు చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
Also Read: డ్రైవింగ్ చేస్తుండగా హార్ట్ ఎటాక్.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు..
జగిత్యాల జిల్లా మేట్ పల్లి మండలం రామచంద్రంపేట గ్రామానికి చెందిన లక్కంపల్లి లక్ష్మి, పెదలింబాద్రి దంపతుల చిన్న కొడుకు లక్కంపల్లి కిరణ్ (38) మెట్ పల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో వర్కర్ గా పనిచేస్తున్నాడు. అతనికి వివాహం నిశ్చయమైంది. వెల్లుల్ల గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. ఆదివారం ఉదయం 10గంటలకు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు.
Also Read: Chiranjeevi : అమ్మ నన్ను గుర్తుపట్టలేదు.. ఆ ఏజ్ లో నన్ను వెతుక్కుంటూ వచ్చి..
శుక్రారం వధువు, వరుడు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ లో పాల్గొన్నారు. ఇద్దరూ ఉత్సాహంగా పాల్గొని ఫొటోలు దిగారు. ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు పెండ్లి వేడుకల్లో నిమగ్నమయ్యారు. సంతోషంగా పెండ్లి పనుల్లో పాల్గొన్నారు. అయితే, శనివారం తెల్లవారుజామున వరుడు కిరణ్ చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లారితే పెళ్లి పీఠలపై ఉండాల్సిన కొడుకు చున్నీకి వేలాడటం చూసి తల్లిదండ్రులు బోరునవిలపించారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
కిరణ్ అనారోగ్య సమస్యలు ఉండటంతో పెండ్లి తరువాత ఇబ్బందులు వస్తాయని భావించి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తల్లి లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిరణ్ ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి.