Telangana : వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన.. నలుగురు మృతి.. తప్పించుకున్న పెద్ద కుమార్తె..

Telangana :వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు.

Telangana : వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన.. నలుగురు మృతి.. తప్పించుకున్న పెద్ద కుమార్తె..

Updated On : November 2, 2025 / 7:17 AM IST

Telangana :వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ పెద్ద యాదయ్య తన భార్య, కుమార్తె, వదిన (భార్య అక్క)ను కత్తితో గొంతుకోసం హత్య చేశాడు. ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి దాడి నుంచి పెద్ద కుమార్తె ప్రాణాలతో బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీ ఘటన స్థలికి చేరుకున్నారు. పరిగి డీఎస్సీ శ్రీనివాస్ ఘటన స్థలిని పరిశీలించారు. ఘటనకు కారణాలపై ఆరా తీస్తున్నారు.

యాదయ్య, అలవేలు భార్యాభర్తలు. వారికి అపర్ణ, శ్రావణి ఇద్దరు కుమార్తెలు. రోజువారీ కూలీగా పనిచేసే యాదయ్య భార్య అలవేలుపై నిత్యం అనుమానం వ్యక్తంచేస్తూ గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు. వారం రోజుల నుంచి భార్యాభర్తల మధ్య ఘర్షణలు తీవ్రం కావడంతో.. ఇద్దరిని రాజీ చేసేందుకు వదిన హన్మమ్మ వచ్చింది. దీంతో శనివారం రాత్రి వారి మధ్య చర్చలు జరిగాయి. ఆ తరువాత అందరూ పడుకున్న సమయంలో అర్ధరాత్రి తరువాత యాదయ్య భార్య, వదిన, చిన్న కుమార్తెను గొంతుకోసి అత్యచేశాడు. పెద్దకుమార్తె అపర్ణపై కూడా దాడి చేయబోగా ఆమె తప్పించుకొని పారిపోయింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేయడంతో.. వారు వచ్చేలోపే యాదయ్య ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.