Sharmila
YS Sharmila: తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ బైపోల్‌లో ఈటల రాజేందర్ తిరుగులేని విజయం సాధించారు. సమీప టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై భారీ మెజారిటీతో గెలిచారు ఈటల. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరపున గెలిచిన ఈటల రాజేందర్‌కు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈటల గెలుపుతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో హుజూరాబాద్‌లో కేసీఆర్‌కు ప్రజలు బాగా బుద్ధి చెప్పారంటూ ట్వీట్ చేశారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వేల కోట్లు ఖర్చుబెట్టినా చెంపచెల్లుమనేలా తీర్పు ఇచ్చారని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రజలు బానిసలు కాదని, ఉద్యమకారులని అన్నారు. కేసీఆర్ గారడీ మాటలు, పిట్ట కథలు జనం నమ్మట్లేదని అన్నారు. ఇకనైనా బుద్ధి వచ్చిందా KCR? అంటూ ట్వీట్ చేశారు షర్మిల.
హుజూరాబాద్ లో KCRకు ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. వేల కోట్లు ఖర్చు పెట్టినా చెంపచెల్లుమనేలా తీర్పు ఇచ్చారు.తెలంగాణ ప్రజలు బానిసలు కాదు.. ఉద్యమకారులని నిరూపించారు.KCR గారడి మాటలు, పిట్ట కథలు జనం నమ్మరు.ఇకనైనా బుద్ధి వచ్చిందా KCR?#NirudyogaNiraharaDeeksha#week15#PrajaPrasthanam pic.twitter.com/mPRj8NX8CE
— YS Sharmila (@realyssharmila) November 2, 2021