TS High Court : దళితబంధు పిటిషన్ పై అత్యవసర విచారణ జరపలేం – హైకోర్టు
దళితబంధు పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జనవాహిని, జైస్వారాజ్ తెలంగాణ రిపబ్లిక్ పార్టీలు ఈ పిటిషన్ దాఖలు చేశాయి.

Ts High Court
TS High Court : దళితబంధు పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జనవాహిని, జైస్వారాజ్ తెలంగాణ రిపబ్లిక్ పార్టీలు ఈ పిటిషన్ దాఖలు చేశాయి.
రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీఎం కేసీఆర్ ను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్లు హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. అయితే అత్యవసరంగా విచారించలేమని లిస్ట్ ప్రకారం విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇక ఇదిలా ఉంటే ఈ నెల 16 తేదీన దళిత బంధు పథకం ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ లో ఈ పథకం ప్రారంభించనున్నారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం.