గ్రూప్-4 ఫలితాలు విడుదల

గత ఏడాది జూలై 1న గ్రూప్ 4 పరీక్షను టీఎస్ పీఎస్ సీ నిర్వహించింది. 8వేల 180 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.

గ్రూప్-4 ఫలితాలు విడుదల

TSPSC Group 4 Results

TSPSC Group 4 Results : గ్రూప్ 4 ఫలితాలను (జనరల్ ర్యాంకింగ్) టీఎస్ పీఎస్ సీ విడుదల చేసింది. జనరల్ ర్యాకింగ్ లిస్ట్ లో 7 లక్షల 26 వేల 837 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అభ్యర్థుల ర్యాంకుల లిస్టును టీఎస్ పీఎస్ సీ వెల్లడించింది. గత ఏడాది జూలై 1న గ్రూప్ 4 పరీక్షను టీఎస్ పీఎస్ సీ నిర్వహించింది. 8వేల 180 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 7లక్షల 26వేల 837 మందిని మెరిట్ జాబితాలో పేర్కొంది.

అభ్యర్థులు వెబ్ సైట్ లో ర్యాంకులు చూసుకోవచ్చంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు ఎంపికైన వారి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామంది. అలాగే అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను ప్రకటిస్తామని TSPSC తెలిపింది.