RTC Buses : ప్రైవేట్ పెట్రోల్ బంకుల ఎదుట ఆర్టీసీ బస్సులు క్యూ
ఈ నెల 16 నుంచి ప్రభుత్వం డీజిల్‌పై సబ్సిడీని ఎత్తివేసింది. దీంతో ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు ప్రైవేట్ బంకుల్లో డీజిల్ ఫిల్ చేయిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

Rtc Bus 11zon
private petrol bunks : ఖమ్మం ఆర్టీసీ డిపోలో కొత్త సమస్య మొదలైంది. డిపో బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడటంతో బస్సులన్ని ప్రైవేట్ బంకుల బాట పట్టాయి. దీంతో ఆర్టీసీ డ్రైవర్లకు కొత్త చిక్కులు మొదలయ్యాయి. ప్రభుత్వం డీజిల్‌పై ఇచ్చే సబ్సిడీ ఎత్తేయడంతోనే ఈ సమస్యలన్ని మొదలయ్యాయని తెలుస్తోంది. గతంలో ప్రభుత్వం లీటర్ డీజిల్‌పై ఏడు రూపాయల సబ్సిడీ ఇచ్చేది.
అయితే ఈ నెల 16 నుంచి ప్రభుత్వం డీజిల్‌పై సబ్సిడీని ఎత్తివేసింది. దీంతో ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు ప్రైవేట్ బంకుల్లో డీజిల్ ఫిల్ చేయిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఖమ్మంలో వారం రోజులుగా ప్రైవేట్ బంకుల్లో అధికారులు డీజిల్ ఫిల్ చేయిస్తున్నారు. దీంతో ప్రైవేట్ బంకుల్లో కిలోమీటర్ల మేర బస్సుల క్యూ కనిపిస్తోంది.
Telangana : తెలంగాణలో సెంచరీ కొట్టిన డీజిల్, గ్యాస్ సబ్సిడీకి మంగళం ?
డ్యూటీ ముగించుకున్నాక డిజీల్ ఫిల్ చేయించుకోవడానికి వచ్చిన డ్రైవర్లు గంటల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. భారీ క్యూలతో ఆర్టీసీ డ్రైవర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఖమ్మంలో వారం రోజులుగా ఇదే తంతు నడుస్తోంది. ఈ అంశంపై అధికారులు స్పందించట్లేదు.