Telangana : తెలంగాణలో సెంచరీ కొట్టిన డీజిల్, గ్యాస్ సబ్సిడీకి మంగళం ?

అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తూ ధరల మోత మోగిస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో ఒక్క రోజు మినహా మిగిలిన అన్ని రోజులూ ధరలు పెరిగాయి.

Telangana : తెలంగాణలో సెంచరీ కొట్టిన డీజిల్, గ్యాస్ సబ్సిడీకి మంగళం ?

Gas, Petrol

Diesel Price Rs 100 : పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేదేలే అంటున్నాయి. చమురు సంస్థలు.. సామాన్యులకు వరుస షాక్‌లు ఇస్తూ వారి నడ్డి విరుస్తున్నాయి. అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తూ ధరల మోత మోగిస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో ఒక్క రోజు మినహా మిగిలిన అన్ని రోజులూ ధరలు పెరిగాయి. తాజాగా వరుసగా మూడోరోజు ఇంధన ధరలు పెంచాయి. లీటరు పెట్రోలుపై మరో 32 పైసలు, డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే పెట్రోల్ సెంచరీ దాటేసి పరుగులు పెడుతుండగా.. తాజాగా డీజిల్ కూడా ఆ మార్కును దాటేసింది.

Read More : Telangana : ఒక్కో కార్మికుడికి రూ. రూ. 1.15 లక్షలు, 11వ తేదీన చెక్ చేసుకోండి

దేశంలో చమరు కంపెనీలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్‌ ధరలు వంద మార్క్ దాటి పరుగులు పెడుతుండగా… తెలంగాణలో మొదటిసారి డీజిల్ ధర సెంచరీ దాటేసింది. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర వంద రూపాయల 13 పైసలకు చేరగా.. రాష్ట్రంలోని 22 జిల్లా కేంద్రాల్లో డీజిల్‌ ధర వంద దాటింది. మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులున్నాయి.

Read More : Private Toilet : 2 వేల 700 ఏండ్ల టాయిలెట్ చూశారా ?

ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పెట్రోల్‌పై లీటర్‌కు 19 రూపాయల 32 పైసలు పెరగగా.. డీజిల్‌పై 18 రూపాయల 38 పైసలు పెరిగింది. ఈనెలలో ఇప్పటివరకు పెట్రోల్‌పై రూపాయి 62 పైసలు, డీజిల్‌పై 2 రూపాయల 3 పైసలు పెరిగింది. పెట్రోల్‌, డిజిల్ ధరలతోపాటు వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా మండిపోతోంది. వినియోగదారులకు ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. తాజాగా సిలిండర్‌పై మరో 15 రూపాయల భారం మోపారు. 14.2 కేజీల వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర గత జులై నుంచి ఇంతవరకు 4 విడతలుగా మొత్తం 90రూపాయలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సిలిండర్ ధర 952 రూపాయలుగా ఉంది.

Read More : India : మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ధరలు పెంచుతుండటంతో చాలా నగరాల్లో సబ్సిడీ గాల్లో కలిసిపోయింది. మరోవైపు.. వంట గ్యాస్‌ సిలిండర్లపై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం సిలిండర్‌పై 40 రూపాయల సబ్సిడీ ఇస్తోంది. ఏడాదికిపైగా ఇదే మొత్తం కొనసాగుతోంది. రానున్న రోజుల్లో దీనికి కూడా మంగళం పాడేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.