Private Toilet : 2 వేల 700 ఏండ్ల టాయిలెట్ చూశారా ?

అతిపురాతన టాయిలెట్ ఎక్కడైనా చూశారా ? దాదాపు 2 వేల 700 సంవత్సరాల క్రితం ఉన్న టాయిలెట్ ఇప్పుడు లభ్యమైంది. ఇజ్రాయిల్.. జెరూసలెంలో జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడింది.

Private Toilet : 2 వేల 700 ఏండ్ల టాయిలెట్ చూశారా ?

Jerusalam

2,700 Year Old Toilet : అతిపురాతన టాయిలెట్ ఎక్కడైనా చూశారా ? దాదాపు 2 వేల 700 సంవత్సరాల క్రితం ఉన్న టాయిలెట్ ఇప్పుడు లభ్యమైంది. ఇజ్రాయిల్.. జెరూసలెంలో జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడింది. క్రిస్టియన్ల పవిత్ర నగరంగా జెరూసలెం పేరు పొందిందనే విషయం తెలిసిందే. ఇక్కడ ప్రైవేట్ బాత్ రూమ్ లు విలాసవంతమైనవని…శాస్త్రవేత్తలు వెల్లడించారు. లభించిన టాయిలెట్ లు ధనవంతులు మాత్రమే వినియోగించేవారని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

Read More : Rameshwar Rao Jupally : టీటీడీ పాలకమండలి సభ్యులుగా జూపల్లి రామేశ్వరరావు ప్రమాణ స్వీకారం

ఈ టాయిలెట్ విషయానికి వస్తే…దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక క్యాబిన్ లో మృదువైన, చెక్కిన సున్నపురాయి టాయిలెట్ ను పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ టాయిలెట్ సౌకర్యవంతంగా కూర్చొవడానికి రూపొందించబడింది. కింద తవ్విన లోతైన సెప్టిక్ ట్యాంక్ కూడా ఉండడం గమనార్హం. ఒక ప్రైవేట్ టాయిలెట్ క్యూబికల్ గా కనిపించడం చాలా అరుదు అని వెల్లడిస్తున్నారు.

Read More : Pakistan: పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. 20మంది మృతి.. 300మందికి గాయాలు

పాత నగరానికి ఎదురుగా ఉన్న విశాలమైన భవనంలో తవ్వకాలు జరపగా..ఇది లభ్యమైందని..ధనవంతులు మాత్రమే ఈ రకమైన టాయిలెట్ లను ఉపయోగించే వారని తెలిపారు. అంతేగాకుండా…నాటి రాతి పనులు, స్తంభాలను కూడా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తోటల్లో పండ్ల మొక్కలు, అలంకరణ మొక్కలతో ఉండేవన్న ఆధారాలున్నాయని తెలిపారు. దీనిద్వారా..అక్కడ నివాసం ఉండేవారు..ధనవంతులు అని తెలియచేస్తున్నాయని వారు తెలిపారు.