Pakistan: పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. 20మంది మృతి.. 300మందికి గాయాలు

పాకిస్తాన్‌లో బలమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైంది.

Pakistan: పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. 20మంది మృతి.. 300మందికి గాయాలు

Earthquake

Pakistan: పాకిస్తాన్‌లో బలమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైంది. భూకంపం కారణంగా 20 మంది మరణించగా.. 300 మంది గాయపడ్డారు. వార్తా సంస్థ AFP ప్రకారం, భూకంపం ప్రకంపనలు పాకిస్తాన్ దక్షిణ భాగంలో సంభవించాయి. భూప్రకంపనలతో క్వెట్టాలో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు.

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం, ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు పాకిస్తాన్‌లోని హర్నాయైకి 14 కి.మీ దూరంలో బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో భూమి కంపిచింది. దీని తరువాత కూడా, తేలికపాటి ప్రకంపనలు నిరంతరం అనుభూతి చెందుతున్నాయి. భూకంపం ప్రకంపనలు చాలా బలంగా ఉన్నట్లుగా నివేదికలు వస్తున్నాయి.

నివేదిక ప్రకారం, బలమైన భూకంపం కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. భూకంప తీవ్రత చాలా బలంగా ఉందని సమీప జిల్లాలపై కూడా ప్రభావం ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఫిబ్రవరి 13 న 6.4 తీవ్రతతో భూకంపం:
13 ఫిబ్రవరి 2021న పాకిస్తాన్‌లో బలమైన భూకంపం సంభవించింది. వార్తా సంస్థ PTI ప్రకారం, భూకంప తీవ్రత 6.4 గా నమోదైంది. నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ సెంటర్ ఆఫ్ పాకిస్తాన్ ప్రకారం, భూకంప కేంద్రం 80 కిలోమీటర్ల లోతులో తజికిస్తాన్‌లో ఉంది. ఇస్లామాబాద్, ఖైబర్ పఖ్తుంఖ్వా మరియు పాకిస్తాన్‌లోని అనేక ఇతర నగరాల్లో భూకంపం సంభవించింది. అయితే, బలమైన ప్రకంపనల తర్వాత కూడా అప్పుడు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. కానీ, ఇప్పుడు ప్రాణ నష్టం భారీగా ఉంది.