India : మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

India : మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

Petrol

India Petrol Price : పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2021, అక్టోబర్ 07వ తేదీ గురువారం లీటర్ పెట్రోల్ పై 32 పైసలు, డీజిల్ పై 38 పైసలు చొప్పున పెరిగాయి. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు మరోమారు సామాన్యుడిపై భారం మోపుతున్నాయి. వీటి ధరల ఎఫెక్ట్ ఇతర వాటిపై పడుతున్నాయి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా…దేశీయ పెట్రోలియం కంపెనీలు మాత్రం…వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ వస్తున్నాయి. పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 103.24 చేరగా..డీజిల్ ధర రూ. 91.77కి చేరుకుంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.40 డీజిల్ ధర రూ. 100.13గా ఉంది.

Read More : OTT Release: ఈ వారం OTTల్లో వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!

ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ లీటర్ పెట్రోల్ రూ. 103.24 లీటర్ డీజిల్ రూ. 91.77
కోల్ కతా లీటర్ పెట్రోల్ రూ. 103.94. లీటర్ డీజిల్ రూ.94.88
ముంబాయి లీటర్ పెట్రోల్ రూ. 109.25. లీటర్ డీజిల్ రూ. 99.55
చెన్నై లీటర్ పెట్రోల్ రూ. 109.25 లీటర్ డీజిల్ రూ. 96.37

Read More : Ongole : నేడు ఒంగోలులో వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడత కార్యక్రమం

గుర్ గావ్ లీటర్ పెట్రోల్ రూ. 100.95 లీటర్ డీజిల్ రూ. 92.50
నోయిడా లీటర్ పెట్రోల్ రూ. 100.53 లీటర్ డీజిల్ రూ. 92.39
బెంగళూరు లీటర్ పెట్రోల్ రూ. 106.83 లీటర్ డీజిల్ రూ. 97.40
భువనేశ్వర్ లీటర్ పెట్రోల్ రూ. 104.57. లీటర్ డీజిల్ రూ. 97.40

Read More : Khammam : ఇంటి నుంచే ఓటు వేయొచ్చు..ఈ-ఓట్ కు తొలి వేదిక ఖమ్మం

చండీఘడ్ లీటర్ పెట్రోల్ రూ. 99.38 లీటర్ డీజిల్ రూ. 91.50
హైదరాబాద్ లీటర్ పెట్రోల్ రూ. 107.40 లీటర్ డీజిల్ రూ. 100.13
జైపూర్ లీటర్ పెట్రోల్ రూ. 110.24 లీటర్ డీజిల్ రూ. 101.13