Khammam : ఇంటి నుంచే ఓటు వేయొచ్చు..ఈ-ఓట్ కు తొలి వేదిక ఖమ్మం

సాధారణంగా పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేస్తారు. ఇక నుంచి స్మార్ట్ ఫోన్ తో ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. ఈ-ఓట్ విధానం అమలులోకి రానుంది. ఈ-ఓట్ విధానానికి ఖమ్మం జిల్లా వేదిక కానుంది.

Khammam : ఇంటి నుంచే ఓటు వేయొచ్చు..ఈ-ఓట్ కు తొలి వేదిక ఖమ్మం

E Vote (1)

Khammam is the first venue for e-vote : సాధారణంగా పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేస్తారు. ఇక నుంచి స్మార్ట్ ఫోన్ తో ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. ఎలక్షన్ లో ఈ-ఓట్ విధానం అమలులోకి రానుంది. ఈ-ఓట్ విధానానికి తెలంగాణలోని ఖమ్మం జిల్లా తొలి వేదిక కానుంది. దేశంలోనే తొలిసారి స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి ఇంటి నుంచే ఓటు వేసే ఈ-ఓట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఐటీ శాఖ లోని ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ డిపార్ట్ మెంట్ రూపొందించిన ఈ-ఓట్‌ విధానాన్ని ఖమ్మం జిల్లాలో పరిశీలించనున్నారు.

రాష్ట్ర ఐటీ శాఖ ఈ మేరకు బుధవారం(అక్టోబర్ 6, 2021) ఒక ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేనప్పటికీ క్షేత్ర స్థాయిలో ఈ-ఓట్‌ విధానం అమలు ఎలా జరుగుతుందో పరిశీలించనున్నారు. అక్టోబర్ 8 నుంచి 18వ తేదీ వరకు ఈ-ఓట్‌ నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 10 వేల మంది ఓటు వేయవచ్చు. అక్టోబర్ 20న ఓటింగ్‌ నిర్వహించనున్నారు.

Triton Model H SUV Leak : టెస్లాకు మించి.. సింగిల్ ఛార్జ్‌‌తో 1,120కి.మీ దూసుకెళ్తుంది.. ఇండియాకు వస్తోంది!

ఈ-ఓట్‌లో పాల్గొనాలంటే ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో గిళీనిది ’జ్న్ము’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 15-20 ఏళ్ల క్రితం దిగిన ఫొటోను కూడా సరిపోల్చగలిగేలా ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీని ఉపయోగించారు. యాప్‌లో తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో వివరాలు ఉంటాయి. ఓటు ఎలా నమోదు చేసుకోవాలి? ఓటు ఎలా వేయాలి? అని తెలుసుకునేలా వీడియోలను అందుబాటులో ఉంచారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ-ఓట్‌పై చూపిన చొరవకు ఐటీ శాఖ తోడ్పాటు ఇవ్వడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని సమస్యలకు పరిష్కారాన్ని సూచించడానికి ఇది ఒక బలమైన ఉదాహరణగా ఉంటుందని తెలిపారు. కేంద్ర ఐటీ విభాగానికి చెందిన సీ-డాక్‌, ఐఐటీ భిలాయ్‌ డైరెక్టర్‌ రజత్‌మోనా, ముంబయి, ఢిల్లీ ఐఐటీలు తోడ్పాటు అందించినట్లు వెల్లడించారు.