Triton Model H SUV Leak : టెస్లాకు మించి.. సింగిల్ ఛార్జ్‌‌తో 1,120కి.మీ దూసుకెళ్తుంది.. ఇండియాకు వస్తోంది!

టెస్లాకు పోటీగా మరో కారు మేకర్ భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది. టెస్లాకు మించిన వేగంతో దూసుకెళ్లే సరికొత్త ఎలక్ట్రిక్ మోడల్ SUV కారు ఫొటోలు లీకయ్యాయి.

Triton Model H SUV Leak : టెస్లాకు మించి.. సింగిల్ ఛార్జ్‌‌తో 1,120కి.మీ దూసుకెళ్తుంది.. ఇండియాకు వస్తోంది!

First Triton Model H Electric Suv Leaked Ahead Of Next Week’s Launch

First Triton Model H electric SUV : అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాకు పోటీగా మరో కారు మేకర్ భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది. టెస్లాకు మించిన వేగంతో దూసుకెళ్లే సరికొత్త ఎలక్ట్రిక్ మోడల్ SUV కారు భారత్‌లో వచ్చేవారం లాంచ్ కానుంది. ఇంతలోనే ఈ SUV కారుకు సంబంధించిన ఫొటోలు లీకయ్యాయి. అమెరికన్ కారు మేకర్ ట్రిటాన్ (Triton) మోడల్ H SUV కారును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు రెడీ అయింది. త్వరలోనే మార్కెట్లోకి ఫస్ట్ మోడల్ Model H electric SUV కారును లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది.

అంతకుముందే కారుకు సంబంధించిన ఎక్స్ క్లూజీవ్ ఫొటోలు లీకయ్యాయి. ఈ ఏడాది మే నెలలోనే Mode H యూటిలిటీ వెహికల్ (SUV) ప్రీ-బుకింగ్స్ ప్రారంభయ్యాయి. అమెరికాలో టెస్లాకు పోటీదారుగా పేరొందిన ఈ ట్రిటాన్ కంపెనీ ముందుగా (IPO) మార్కెట్లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. భారత మార్కెట్లో ట్రిటాన్ నుంచి లాంచ్ కానున్న మొట్టమొదటి మోడల్ కారు.. ఈ మోడల్ కారు ఏడు కలర్ ఆప్షన్లలో వస్తోంది. ఇప్పటికే లీకైన ఫొటోల్లో మెటాల్లిక్ బ్లూ (Metallic Blue) కారు మోడల్ కనిపించింది.
Old Car Renewal : మీకు 15ఏళ్లు దాటిన పాత కారు ఉందా? 8 రెట్లు ఫీజు చెల్లించాల్సిందే!

ప్రీ-బుకింగ్స్ ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. సాధారణ SUV కార్ల కంటే ట్రిటాన్‌ H SUV మోడల్‌ విశాలంగా ఉంటుంది. కంపెనీ వ్యవస్థాపకుడు హిమాన్షు పటేల్‌ ట్రిటాన్‌ H SUV మోడల్‌ను సూపర్‌ SUVగా పేర్కొన్నారు. ట్రిటాన్ మోడల్ H electric SUV 1,500 హర్స్‌పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కారులో 200kWh (kilowatt-hour) బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే గరిష్టంగా 1,120 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

హైపర్‌ ఛార్జింగ్‌ సాయంతో కేవలం రెండు గంటల్లోనే బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌ అయిపోతుంది. ఈ కారు 0 కిలోమీటర్ల నుంచి 96 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.9 సెకండ్లలో అందుకుంటుంది. కారులో సోలార్ ప్యానెల్ రూఫ్‌ను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని పూణెలో ట్రిటాన్‌ కంపెనీ తొలి మ్యానిఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ మొదటి ఆరు నెలల్లో 100 కార్లను తయారుచేయాలని టార్గెట్ పెట్టుకుంది.

భారత్‌లో 1000 కార్ల కోసం ముందస్తుగా బుకింగ్‌ ప్రారంభిస్తామని హిమాన్షు పటేల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికాలో ట్రిటాన్‌ H SUV ధర సుమారు రూ. 1.05 కోట్లుగా ఉంది. అయితే ఈ మోడల్‌ SUV కారును అమెరికాలో కన్నా అత్యంత తక్కువ ధరకే విక్రయిస్తామని హిమాన్షు పటేల్‌ స్పష్టం చేశారు.
Rolls-Royce car gift. : భార్యకు బర్త్‌డే గిఫ్ట్ గా రూ.3.24కోట్ల రోల్స్ రాయిస్ కారు