Rolls-Royce car gift. : భార్యకు బర్త్‌డే గిఫ్ట్ గా రూ.3.24కోట్ల రోల్స్ రాయిస్ కారు | Rolls-Royce Wraith Black Badge birthday gift for wife

Rolls-Royce car gift. : భార్యకు బర్త్‌డే గిఫ్ట్ గా రూ.3.24కోట్ల రోల్స్ రాయిస్ కారు

భారతీయ యువ వ్యాపారవేత్త తన భార్య బర్త్ డే గిఫ్ట్ గా రూ.3.24కోట్ల ఖరీదైన రోల్స్ రాయిస్ వ్రైత్ లగ్జరీ కారుని గిఫ్టుగా ఇచ్చాడు.

Rolls-Royce car gift. : భార్యకు బర్త్‌డే గిఫ్ట్ గా రూ.3.24కోట్ల రోల్స్ రాయిస్ కారు

Rolls-Royce Wraith Black Badge gift : దుబాయ్. భూతల స్వర్గం. ఎంత రిచ్ గా ఉంటుందో అక్కడ శ్రీమంతులు వారి భార్యలకు, బిడ్డలకు ఇచ్చే గిఫ్టులు కూడా అంతే రిచ్ గా ఉంటాయి. దుబాయ్ లో సెటిల్ అయిన భారతీయ యువ వ్యాపారవేత్త తన భార్య బర్త్ డేకు సర్ ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. దుబాయ్ కరెన్సీ ప్రకారం 1.6 మిలియన్ దిర్హమ్స్ అంటే మన కరెన్సీలో దాదాపు రూ.3.24కోట్ల ఖరీదైన రోల్స్ రాయిస్ వ్రైత్ లగ్జరీ కారుని గిఫ్టుగా ఇచ్చాడు. పైగా ఆ కారు అంటే ఆమెకు చాలా చాలా ఇష్టం. దీంతో తనకు ఎంతో ఇష్టమైన కారునే గిఫ్ట్ గా ఇవ్వటంతో ఆమె సంతోషానికి హద్దే లేకుండాపోయింది. తెగ సంబరపడిపోయింది. పైగా ఆమె నెల రోజుల క్రితం ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో తన ముద్దుల పాప,భర్తతో పాటు భర్త ఇచ్చిన కారుతో చక్కటి ఫోటో తీయించుకుని మురిసిపోయింది. అలానెల రోజుల్లో తనకు ఇష్టమైన రెండు అద్భుతమైన గిప్టులు లభించినందుకు తెగ మురిసిపోయింది.

Read more : Mercedes Benz Gift : ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్..బాగా పనిచేస్తే మెర్సిడెస్ బెంజ్ కార్లు గిఫ్టు

దుబాయ్ లో బీబీసీ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో 30 ఏళ్ల అమ్జాద్ సితార భారత్ లోని కేరలకు చెందిన యువకుడు. బీబీపీ గత 10ఏళ్లుగా దేశవ్యాప్తంగా కార్మికులను సరఫరా చేస్తున్న సంస్థ బీబీసీ. మ్యాన్‌పవర్ (మానవశక్తి సరఫరా) సప్లైలో ప్రస్తుతం యూఏఈలోనే టాప్ కంపెనీ ఇది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అమ్జద్ సితార. ఆయనకు భార్య మార్జన అమ్జాద్. వయస్సు 24 ఏళ్లు. వారికి నెల రోజుల క్రితం ఓ పాప పుట్టింది. పాప పేరు ఐరా మాలిక. కొత్తగా తమ జీవితంలోకి వచ్చిన ముద్దుల కూతురితో సంతోషాన్ని ఆస్వాదిస్తున్నారు అమ్జద్ కుటుంబం. ఈక్రమంలో అక్టోబర్ 2న అమ్జాద్ భార్య మార్జన్ పుట్టిన రోజు కావడంతో ఆమెకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు.

Read more : Freshworks : కోటీశ్వరులైపోయిన ఇండియన్ కంపెనీ ఉద్యోగులు..‘శిఖ‌రాన్ని అందుకున్నాం..ఆకాశాన్ని తాకుతాం’..అంటున్న సీఈవో

శ్రీమంతులు తలచుకుంటే అదెంత? అలా అనుకున్నట్లుగా అమ్జాద్ తన భార్యకు ఎంతో ఇష్టమైన రోల్స్ రాయిస్ వ్రైత్ లగ్జరీ కారును గిఫ్టుగా ఇచ్చాడు. ఆమె పుట్టినరోజు నాడు ఆమెను దుబాయ్‌లో కారు కొన్న షోరూంకు తీసుకెళ్లాడు. అప్పటికే అమ్జద్ సూచనతో షోరూం వాళ్లు ఆ కారును పెద్ద థర్మకోల్ బాక్సులో గిఫ్ట్‌లా ప్యాక్ చేసి పెట్టారు. ఆ భారీ బాక్సును రిబ్బన్‌తో కట్టిపెట్టారు. ఆ బాక్సుపై “హ్యాపీ బర్త్‌డే మై లవ్. నా ప్రతిక్షణాన్ని ఎంతో అద్భుతంగా మార్చినందుకు థ్యాంక్స్. ప్రేమతో అమ్జద్ సితార” అని రాసి ఉంది.

బాక్సుకు ఉన్న రిబ్బన్‌ను దంపతులిద్దరూ ఒకేసారి విప్పడంతో లోపల ఎర్రటి బెలూన్స్, ఎర్రటి రోల్స్ రాయిస్ వ్రైత్ లగ్జరీ కారు కనిపించాయి. అంతే.. తనకు ఎంతో ఇష్టమైన రోల్స్ రాయిస్ వ్రైత్ కారు చూసిన మార్జన ఆనందానికి అవధుల్లేవు. మార్జన, అమ్జద్ వారి చిన్నారి ఐరాతో కలిసి కారు ముందు ఫొటోలు దిగారు. భర్త, కూతురుతో కలిసి కారులో కూడా కూర్చుని ఆనందపడిందామె. దీన్నంతటినీ వీడియో తీయించిన అమ్జద్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. దాంతో అది కాస్తా వైరల్ అయింది. భార్యకు లగ్జరీ గిప్ట్ ఇచ్చిన యవ పారిశ్రామిక వేత్త అంటూ వైరల్ అయ్యింది.

Read more :

×