Mercedes Benz Gift : ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్..బాగా పనిచేస్తే మెర్సిడెస్ బెంజ్ కార్లు గిఫ్టు

ఐటీ ఉద్యోగులకు ప్రముఖ సంస్థ HCL బంపర్ ఆఫర్ ప్రకటించింది. బాగా పనిచేస్తే మెర్సిడెస్ బెంజ్ కార్లు గిఫ్టుగా ఇస్తామని ప్రకటించింది దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్.

Mercedes Benz Gift : ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్..బాగా పనిచేస్తే మెర్సిడెస్ బెంజ్ కార్లు గిఫ్టు

Hcl It Offer Car (1)

Mercedes Benz car gift : ఐటీ ఉద్యోగం అంటే లక్షల్లో జీతం..వారానికి రెండు రోజులు సెలవు. విదేశీ ప్రయాణాలు. ఇలా ఐటీ ఉద్యోగులకు ఎన్నో సౌకర్యాలుంటాయి. చేతినిండా డబ్బే డబ్బు. ఉద్యోగుల కోసం లెక్కలేనన్ని ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి ఆయా ఐటీ కంపెనీలు. అటువంటి ఐటీ ఉద్యోగులకు ప్రముఖ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బాగా పనిచేస్తే బెంజ్ కారు గిఫ్టుగా ఇస్తామని ప్రకటించింది. పైగా మామూలు బెంజ్ కారు కూడా కాదండోయ్..మెర్సిడెస్ బెంజ్ కారు గిఫ్టుగా ఇస్తామని ప్రకటించింది దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్. వర్కులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు మెర్సిడెస్ బెంజ్ కార్లను ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.

కాగా ఇలా బెంజ్ కార్లు గిప్టుగా ఇవ్వటం ఈ కంపెనీకి కొత్తకాదు..గత 2013లో హెచ్‌సీఎల్‌ టెక్ కంపెనీ 50 మంది ఉద్యోగులకు మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లను బహుమతులుగా అందించింది. ఆ తర్వాత కార్లను గిఫ్ట్‌గా ఇవ్వటం మానేసింది. ఈక్రమంలో ప్రతిభ కలిగిన ఉద్యోగుల్ని వదులుకుని నష్టపడే కంటే వారికి గిప్టులు ఇచ్చి నిలుపుకోవటమే మేలు అని భావించిన హెచ్ సీఎల్ మరోసారి ఇటువంటి గిప్టులు ప్రకటించింది. ఐటీ దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ మంచి ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు మెర్సిడెస్ బెంజ్ కార్లను ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన సందర్భంగా..సీహెచ్‌ఆర్‌ఓ వి.వి.అప్పారావు మీడియాతో మాట్లాడుతూ..‘చక్కటి ప్రతిభ కనబరిచే ఉద్యోగులకు మెర్సిడెస్ బెంజ్ కార్లను ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించామని..మా ప్రపోజల్ కి బోర్డు ఆమోదం తెలపగానే ప్రతిభావంతులకు కార్లను గిఫ్ట్‌గా ఇస్తాం’ అని తెలిపారు.

ఒక ఉద్యోగి కంపెనీని వదిలి వెళ్లిపోతే..ఆ ప్లేస్ ను రీప్లేస్ చేయటానికి 15% నుంచి 20% ఎక్కువగా ఖర్చు అవుతోందనీ..ఇటువంటి ఖర్చును తగ్గించుకోవడానికి మా సంస్థ ఉద్యోగుల్లోనే న్యూ స్కిల్స్ పెంచేలా చేస్తున్నామని తెలిపారు. కొత్త ప్రొఫెషనల్స్ అవసరం లేకుండా జాగ్రత్త పడుతున్నామనీ.. జావా డెవలపర్స్ మేము ఆఫర్ చేస్తున్న వేతనాలకే ఉద్యోగాలు చేయడానికి రెడీ అవుతున్నారని తెలిపారు. కానీ క్లౌడ్ ప్రొఫెషనల్‌ను అపాయింట్ చేసుకోవటానికి భారీ జీతాలు ఇవ్వాల్సి వస్తోందని వి.వి అప్పారావు తెలిపారు.

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022 ఆర్థిక సంవత్సరంలో 50 శాతం ఎక్కువగా ఫ్రెషర్లను నియమించుకుంటామని ఇటీవల హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రకటించటం విశేషం. దీంట్లో భాగంగా సదరు సంస్థ 20 నుంచి 22 వేల ఫ్రెషర్లను నియమించుకుంటామని ప్రకటించింది. తమ ఉద్యోగులు వేరే కంపెనీకి వెళ్లకుండా ఉండేలా చేసుకోవటానికి హెచ్‌సీఎల్‌ జీతాలను కూడా భారీగానే పెంచింది. ఇలా పెంచిన జీతాలు జులై 1కి అమలోకి వచ్చాయి.

కాగా..ఐటీ ఉద్యోగులు హైక్ ల కోసం పలు కంపెనీలు మారుతుంటారు. అలా ఎక్స్ పీరియన్స్ పెంచుకుంటూ జీతాలు ఏ కంపెనీ ఎక్కువిస్తే ఆ కంపెనీకి వెళ్లిపోతుంటారు. దీనిపై మాట్లాడుతూ..ఇతర దిగ్గజ ఐటీ కంపెనీలతో పోల్చుకుంటే తమ కంపెనీలో వలసల రేటు తక్కువగానే ఉందని..గత 12 నెలల్లో వలసల రేటు 11.8 శాతంగా ఉందని కంపెనీ తెలిపారు.