Telangana : ఒక్కో కార్మికుడికి రూ. రూ. 1.15 లక్షలు, 11వ తేదీన చెక్ చేసుకోండి

సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఆ లాభాల్లో కొంత వాటాను కార్మికులకు ఇస్తున్నారు.

Telangana : ఒక్కో కార్మికుడికి రూ. రూ. 1.15 లక్షలు, 11వ తేదీన చెక్ చేసుకోండి

Singareni

Singareni employees : ఒక్కో కార్మికుడికి రూ. రూ. 1.15 లక్షలు జమ చేయనున్నారు. 2021, అక్టోబర్ 11వ తేదీన ఈ డబ్బులను వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ప్రతి సంవత్సరం ఇచ్చినట్లే..ఈసారి కూడా దసరా, దీపావళి బోనస్ లను ప్రకటించారు. సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఆ లాభాల్లో కొంత వాటాను కార్మికులకు ఇస్తున్నారు. ఈసారి 29 శాతం సొమ్మును సింగరేణి కార్మికులకు బోనస్ గా ప్రకటించారు. ఈ లాభాల సొమ్మును ఈనెల 11వ తేదీన చెల్లించనున్నట్లు సీఎండీ ఎన్.శ్రీధర్ ప్రకటించారు.

Read More : Indrakeeladri: ‘తిరుమల స్థాయిలో ఇంద్రకీలాద్రి.. రూ. 75 కోట్లతో అభివృద్ధి’

దీని కింద రూ.79.07 కోట్లను కార్మికులకు పంపిణీ చేస్తామన్నారు. దీపావళి బోనస్ నవంబర్ 01వ తేదీన కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని, ఇందుకోసం రూ. 300 కోట్లను వెచ్చిస్తోందన్నారు. ప్రతి కార్మికుడు రూ. 72 వేల 500 అందుకోనున్నారని, పండుగ అడ్వాన్స్ కింద ప్రతి కార్మికుడికి రూ. 25 వేల చొప్పున సంస్థ ప్రకటించడం జరిగిందని..ఈ డబ్బును ఈ నెల 08వ తేదీన చెల్లించనుందని తెలిపారు. రెండు రకాల బోనస్ లు, పండుగ అడ్వాన్స్ కలిపి సగటున రూ. 1.15 లక్షలు వరకు రానున్న మూడు వారాల్లో కార్మికులు అందుకోనున్నారని తెలిపారు.

Read More : Rajanna Sirisilla : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు

అయితే..ఈ డబ్బును దుబారా చేయకుండా…పొదుపు చేయడం లేదా గృహావసరాలకు వాడుకోవాలని ఆయన సూచించారు. మరింత ఉత్సాహంగా..కలిసికట్టుగా పనిచేసి సింగరేణి సంస్థను మరింత ముందుకు తీసుకెళుదామని ఆయన సూచించారు. నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని, మరింత మెరుగైన బోనస్ లు, సంక్షేమం అందుకోవచ్చని తెలిపారు. బోనస్ లు ప్రకటించడంతో…సింగరేణిలో ముందుగానే పండుగ వాతావరణం నెలకొన్నది. సింగరేణి సంస్థలో దాదాపు 43 వేల మంది కార్మికులు, 2,300 మంది అధికారులున్నారు. వీరందరికీ లాభాల్లో వాటా మొత్తాన్ని అందించనున్నారు. లాభాల్లో వాటాను 29 శాతానికి పెంచుతూ సీఎం కేసీఆర్‌ నిర్ణయించడంపై సీఎండీ శ్రీధర్‌ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.