TTDP New President: తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడు ఎన్నిక

తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్ భవన్ కు చేరుకుని ఎన్నికలో పాల్గొన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బక్కని నరసింహులుకు నాయకులంతా అభినందనలు తెలియజేశారు.

TTDP New President: తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడు ఎన్నిక

Ttdp President

Updated On : July 19, 2021 / 1:21 PM IST

TTDP New President: తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్ భవన్ కు చేరుకుని ఎన్నికలో పాల్గొన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బక్కని నరసింహులుకు నాయకులంతా అభినందనలు తెలియజేశారు.

అధ్యక్షుడిగా తన ఎంపికపై మాట్లాడిన నర్సింహులు.. ‘నాపై నమ్మకంతో టీ.టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టినందుకు.. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు అని అన్నారు.

టీటీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్తూ.. కార్యకర్తగా పార్టీలోకి వచ్చి లీడర్ గా మారి పార్టీ మారినంత మాత్రనా టీడీపీ కి వచ్చిన నష్టమేమీ లేదని.. రీసెంట్ గా టీఆర్ఎస్ లో చేరిన ఎల్ రమణ గురించి కామెంట్ చేశారు.

టీడీపీలో మండల స్థాయి నుంచి రాష్ట్ర నేత వరకూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చా. ఎమ్మెల్యేగా చేశా. ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటా. టి.టీడీపీని వీడనని వెంకటేశ్వర స్వామి మీద శపథ చేస్తున్నా. టి.టీడీపీ బలోపేతం చేసేందుకు రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపడతామని అన్నారు.