Two Families Attack : హైదరాబాద్ లో రెండు కుటుంబాలు కత్తులతో దాడులు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
కత్తులు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో సుల్తాన్, మోయెజ్, ఫాయిమ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.

Clash
Two families attacked : హైదరాబాద్ లో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కూకట్ పల్లి రాజీవ్ గాంధీ నగర్ లో శుక్రవారం (మార్చి 11,2022) రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో సుల్తాన్, మోయెజ్, ఫాయిమ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ ఘర్షణ తర్వాత ఇరు కుటుంబాలు కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. కూకట్ పల్లి రాజీవ్ గాంధీ నగర్ లో ఎదురెదురుగా ఉంటున్న రెండు కుటుంబాలకు సంబంధించి 2010లో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఆ తర్వాత రెండు కుటుంబాల సభ్యులు మాట్లాడుకోవడం లేదు. అయితే ఇన్ని సంవత్సరాలు కూడా ఎదురు పడినా, మాట్లాడుకోవడం, ఫంక్షన్ జరిగినా పిలుచుకునేవారు కాదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఎదురింటికి సంబంధించిన వ్యక్తి వీరిని చూసి నవ్వాడనే కారణంతో ఆగ్రహించిన మరో ఫ్యామిలీ గొడవకు దిగింది.
Students Clash : పదవ తరగతి విద్యార్ధుల మధ్య ఘర్షణ-ఒకరి మృతి
దీంతో ఇరు కుటుంబాల సభ్యులు కత్తులు, కర్రలు, రాళ్లతో సరస్పరం దాడులు చేసుకున్నారు. పెద్ద ఎత్తున గొడవ పడ్డారు. ఈ ఘటనలో సుల్తాన్, మోయెజ్, ఫాయిమ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇరు కుటుంబాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.