Amit Shah : షా వస్తున్నారు, రాజమౌళిని కలవనున్నారు.. తెలంగాణలో అమిత్ షా టూర్ అధికారిక షెడ్యూల్ ఖరారు

Amit Shah : డైరెక్టర్ రాజమౌళిని అమిత్ షా కలవనున్నారు. అలాగే కార్యకర్తలతో భేటీ కానున్నారు.

Amit Shah (Photo : Twitter, Google)

Amit Shah Telangana Tour : బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. టూర్ కి సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఖరారైంది. తెలుగు సినీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిని అమిత్ షా కలవనున్నారు. అలాగే కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఆ తర్వాత ఖమ్మం బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం గుజరాత్ కు పయనం కానున్నారు.

తెలంగాణ పర్యటనలో భాగంగా కొందరు ప్రముఖులతో అమిత్ షా సమావేశం కానున్నారు. మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఇందుకోసం బుధవారం రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా.. రాత్రి నగరంలోనే బస చేస్తారు. గతంలో హైదరాబాద్ లో పర్యటించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్, నితిన్, మిధాలీ రాజ్ తదితరులతో అమిత్ షా భేటీ అయ్యారు.

 

అమిత్ షా పర్యటన షెడ్యూల్..
* రేపు(జూన్ 14) రాత్రి 11:55కు శంషాబాద్‌కు అమిత్‌షా
* శంషాబాద్‌లోని నోవాటెల్‌లో బస
* జూన్ 15న ఉదయం 10:30కు ఏబీఎన్ రాధాకృష్ణ ఇంటికి అమిత్‌ షా
* 15న 11:45కు రాజమౌళిని కలవనున్న అమిత్ షా
* మణికొండలోని రాజమౌళి నివాసంలో భేటీ

Also Read..Amit Shah in South: అమిత్‌షా ఏమన్నారో విన్నారా.. సౌత్‌లో బీజేపీకి 80 ఎంపీ సీట్లు సాధ్యమేనా?

* అరగంటపాటు రాజమౌళితో మాట్లాడనున్న షా
* 12:45కు శంషాబాద్‌ జేడీ కన్వెన్షన్‌కు కేంద్ర హోంమంత్రి
* గంట పావు పాటు కార్యకర్తలతో లంచ్‌ మీటింగ్‌
* మ.2:25కు హెలికాప్టర్‌లో భద్రాచలానికి పయనం
* 3:45కు భద్రాచలం చేరుకోనున్న అమిత్‌షా

* సా.4 గంటలకు భద్రాచలంలో స్వామి వారి దర్శనం
* 40 నిమిషాల పాటు భద్రాచలం ఆలయంలోనే గడుపుతారు
* సా.5 గంటలకు భద్రాచలం నుంచి ఖమ్మంకి బయల్దేరతారు
* 5:30కు ఖమ్మం చేరుకుంటారు
* ఎన్టీఆర్ శతజయంతి సంద్భంగా 5:40కు ఖమ్మంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు

Also Read..Uttar Pradesh: మోదీ-యోగీ రాజకీయాలపై చర్చ.. కారుతో ఢీకొట్టి చంపిన డ్రైవర్

* సా.6 గంటలకు ఖమ్మం బహిరంగసభకు హాజరు
* గంటపాటు బహిరంగసభ వేదికపై అమిత్‌షా
* 7:10 ఖమ్మం గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు
* 7:40కి ఖమ్మం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్తారు
* రాత్రి 8:15కు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్‌ వెళ్లనున్న అమిత్‌ షా