Union Minister Amit Shah: హైదరాబాద్‌లో అమిత్ షా .. సీఐఎస్ఎఫ్ రైజింగ్ డేలో పాల్గోనున్న కేంద్ర మంత్రి

ఆదివారం ఉదయం 7.30గంటల నుంచి 9.16 గంటల వరకు సీఐ‌ఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్ లో ముఖ్యఅతిథిగా అమిత్ షా పాల్గొంటారు. ఉదయం 11.35 గంటల వరకు నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీలోనే ఉంటారు. 11.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రోడ్డుమార్గంలోనే హకీంపేట ఎయిర్ ఫీల్డ్ కు వెళ్తారు.

Union Minister Amit Shah: హైదరాబాద్‌లో అమిత్ షా .. సీఐఎస్ఎఫ్ రైజింగ్ డేలో పాల్గోనున్న కేంద్ర మంత్రి

Amit shah

Updated On : March 12, 2023 / 7:10 AM IST

Union Minister Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు చేరుకున్నారు. శనివారం రాత్రి 11గంటలకు హైదరాబాద్ చేరుకున్న అమిత్ షాకు బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్ ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ తదితరులు స్వాగతం పలికారు. వారితో అమిత్ షా కొద్దిసేపు ఎయిర్ పోర్టులోనే ముచ్చటించారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలు, పార్టీకి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే, ఆదివారం మరోసారి రాష్ట్ర పార్టీ నేతలతో అమిత్ షా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Kharge vs Amit Shah: అహంకారానికి పరాకాష్ట.. అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ ఖర్గే

శనివారం రాత్రి 11గంటల సమయంలో హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్ ఫీల్డ్‌కు చేరుకున్న అమిత్ షా రోడ్డు మార్గం ద్వారా నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీ (నిషా)కి చేరుకున్నారు. కొంతసేపు ఉన్నతాధికారులతో సమీక్షించిన తర్వాత రాత్రి అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం 7.30గంటల నుంచి 9.16 గంటల వరకు సీఐ‌ఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్ లో ముఖ్యఅతిథిగా అమిత్ షా పాల్గొంటారు. ఉదయం 11.35 గంటల వరకు నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీలోనే ఉంటారు. 11.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రోడ్డుమార్గంలోనే హకీంపేట ఎయిర్ ఫీల్డ్ కు వెళ్తారు. 11.50 గంటలకు ప్రత్యేక విమానం ద్వారా కేరళలోని కోచికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెళ్లనున్నారు.

Telangana BJP: అమిత్ షాతో ముగిసిన బీజేపీ నేతల భేటీ.. కేసీఆర్ అవినీతిపై ప్రచారం చేయాలని అమిత్ షా సూచన

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ నేపథ్యంలో అమిత్ షా హైదరాబాద్‌కు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా సీఐ‌ఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు వచ్చినా రాష్ట్ర పార్టీ నేతలతో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం అధికార కార్యక్రమం ముగించుకొని వెళ్లే ముందు ఈ మేరకు రాష్ట్ర పార్టీ నేతలతో అమిత్ షా సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.