Bandi Sanjay : ఏడాది పాటు రైతు భరోసా ఎగ్గొట్టారు- రేవంత్ సర్కార్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్

నెల రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఒక నెల రోజుల పాటు ఫామ్ హౌస్ కేసు అంటారు.

Bandi Sanjay

Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ రూట్ లోనే కాంగ్రెస్ వెళ్తోందన్నారు. ఏడాది పాటు రైతు భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆరోపించారు. ఇప్పుడేమో 12వేల రూపాయలే ఇస్తామని చెప్పటం దారుణం అన్నారు. ప్రభుత్వం ఒక్కో ఎకరాకు రూ.18వేలు బాకీ ఉందని మండిపడ్డారు బండి సంజయ్.

ఏడాదిగా టైమ్ పాస్ పాలిటిక్స్ చేస్తున్నారు..
”ఆరు గ్యారెంటీల గురించి ప్రజలు ప్రశ్నిస్తారని భయపడ్డ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎమోషనల్ పాలిటిక్స్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఏడాదిగా టైమ్ పాస్ పాలిటిక్స్ చేస్తోంది. ఒక్కోసారి ఒక్కో విషయాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారేమో కాళ్లేశ్వరం మీద కమిషన్ అంటారు. ఒక నెల రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఒక నెల రోజుల పాటు ఫామ్ హౌస్ కేసు అంటారు. ఒక నెల పాటు డ్రగ్స్ కేసు అంటారు. ఇవాళ కొత్తగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు స్టార్ట్ చేశారు.

Also Read : తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ వైఖరి తేటతెల్లమైంది: కేటీఆర్

మోసం చేయడంలో కేసీఆర్ ను ఫాలో అవుతున్నారు..
ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్లాన్ ఇది. కేసీఆర్ ప్రభుత్వం చేసిందే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మోసం చేయడంలో గురువు కేసీఆర్. ప్రజల సమస్యలను, ఆరు గ్యారెంటీలను ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా పాలన చేయాలి అనే దాని గురించి పట్టించుకోవడం లేదు. కేసీఆర్ ఏ విధంగా గత పదేళ్లు మోసం చేశారో, ఏ విధంగా ప్రజలను నమ్మించారో, వాగ్దానాలను విస్మరించి ప్రజలను మోసం చేసి ఏ విధంగా ఎన్నుకోబడ్డారో, ఆ విషయంలో శిక్షణ పొంది తిరిగి సేమ్ మోసాలు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది.

పాతోళ్లు 10వేలు ఇస్తే మీరు 15వేలు ఇస్తామని చెబితే నమ్మి కాంగ్రెస్ కు ఓటు వేస్తే.. ఏడాది నుంచి ఇవ్వలేదు. పైగా ఇప్పుడు ఏమంటున్నారంటే 15వేల కాదు 12వేలు ఇస్తామంటున్నారు. మరి 12వేలు ఇస్తే, ఇప్పటికే రెండు విడతలు ఇవ్వాలి. ఇది మూడో విడత. అంటే, ఒక్కో రైతు ఖాతాల్లో రూ.18వేలు వేయాలి. వేస్తారా లేదా?

ఒక్కో రైతు ఖాతాలో రూ.18వేలు వేయాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరమైంది. ఇప్పటికే 12వేలు వేయాలి. ఇప్పుడు మరో విడత ఇవ్వాలి. 12వేలు, 6వేలు.. మొత్తం 18వేల రూపాయలు ఒక్కో రైతు ఖాతాలో వేయాలి. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు అందరికీ ఇస్తామన్నారు. ఇప్పుడు మోసం చేశారు” అని రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు బండి సంజయ్.

 

Also Read : హైదరాబాద్ లో హైడ్రా యాక్షన్ కంటిన్యూ.. అయ్యప్ప సొసైటీలోని 5 అంతస్తుల భవనం కూల్చివేత..