Hydra Demolitions : హైదరాబాద్ లో హైడ్రా యాక్షన్ కంటిన్యూ.. అయ్యప్ప సొసైటీలోని 5 అంతస్తుల భవనం కూల్చివేత..
గతంలో ఈ భవనానికి సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయి.

Hydra Demolitions In Madhapur
Hydra Demolitions : హైదరాబాద్ లో హైడ్రా యాక్షన్ కంటిన్యూ అవుతోంది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. భవనం మెయిన్ రోడ్ పక్కనే ఉండటంతో పవర్ సప్లయ్ నిలిపివేశారు. మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. పోలీసుల భద్రత మధ్య కూల్చివేత పనులు చేపట్టారు.
అయ్యప్ప సొసైటీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. కొన్ని గంటల నుంచి ఈ కూల్చివేత పనులు జరుగుతున్నాయి. భారీ క్రేన్ సాయంతో కూల్చివేతలు చేస్తున్నారు. ఇది జీ ప్లస్ 5 భవనం. ముందుగా పిల్లర్లకు సంబంధించిన గోడలను కూల్చివేస్తున్నారు.
Also Read : ఆ అనుభవం కాంగ్రెస్‌కు ఉంది.. ప్రజా ప్రభుత్వ ఆకాంక్ష ఇదే: పొన్నం ప్రభాకర్
ఐదు అంతస్తుల భవనంపై అనేక ఫిర్యాదులు..
గతంలో ఈ భవనానికి సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో హైడ్రా కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఫీల్డ్ విజిట్ చేశారు. ఈ భవనానికి సంబంధించి ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం చేయడంతో పక్క ప్లాట్ల వారికి వెళ్లేందుకు దారి లేకపోవడం, పలు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో వారు అనేక సార్లు ఫిర్యాదులు చేశారు.

Hydra (Photo Credit : Google)
సెట్ బ్యాక్ లేకపోవడం, దారి లేకపోవడం…
చుట్టుపక్కల ఉన్న ప్లాట్లకు సంబంధించి ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా ఈ ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఈ నిర్మాణంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని చుట్టుపక్కల ప్లాట్లలో ఉన్న వారు వాపోయారు. తమకు దారి లేకుండా పోయిందన్నారు. దీనిపై వారు జీహెచ్ఎంసీకి కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగారు.
భవన నిర్మాణానికి పలు అనుమతులు లేనట్లు గుర్తింపు..
5 అంతస్తుల భవనాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. భవనానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి? ఎందుకు ఈ నిర్మాణంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి? దీనిపై కమిషనర్ రంగనాథ్ ఫీల్డ్ వర్క్ చేశారు. వీటన్నింటిని పూర్తిగా పరిశీలించారు. సెట్ బ్యాక్ లేకపోవడం, పక్క ప్లాట్ల వారికి ఇబ్బందులు కలగడం, నిర్మాణానికి సంబంధించి కొన్ని అనుమతులు లేవని కమిషనర్ రంగనాథ్ గుర్తించారు. ఫిర్యాదుల మేరకు భవనాన్ని కూల్చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
Also Read : తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ వైఖరి తేటతెల్లమైంది: కేటీఆర్