తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ వైఖరి తేటతెల్లమైంది: కేటీఆర్

ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసిందని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ వైఖరి తేటతెల్లమైంది: కేటీఆర్

KTR

Updated On : January 5, 2025 / 3:58 PM IST

తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ వైఖరి తేటతెల్లమయిందని రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అంటేనే దగా, మోసం అని మరోసారి నిరూపితం అయిందని చెప్పారు. రైతుబంధుపై రాష్ట్ర నేతలపై నమ్మకం కుదరకపోవడంతో రాహుల్ గాంధీతో కూడా రూ.15 వేలు ఇస్తామని హామీ ఇప్పించారని తెలిపారు.

ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మోసం, దగా, నయవంచన అనేవి చాలా చిన్న పదాలని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు పథకాన్ని అమలు చేసింది తమ ప్రభుత్వమేనని చెప్పారు.

ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ దాకా కచ్చితంగా కాంగ్రెస్ నేతలు అందరూ తెలంగాణకు క్షమాపణ చెప్పాల్సిందేనని కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే పరిస్థితులు బాగున్నాయని రేవంత్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో నుంచి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అవమాన పరుస్తున్నారని అన్నారు.

ఆర్థిక పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. 5,943 కోట్ల రూపాయల మిగులు నిధులతో తాము 2023లో కాంగ్రెస్‌కి ప్రభుత్వాన్ని అప్పగించామని తెలిపారు.

జగన్ విధ్వంసంతో గాడి తప్పిన వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు: మంత్రి నిమ్మల