కేసీఆర్ మీద కోపంతోనే కాంగ్రెస్‌కు ఓటు వేశారు- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అహంకారం వలనే ఓడామని కేసీఆర్ కుటుంబం తెలుసుకోలేకపోతోంది. కేసీఆర్ మాదిరి‌... రేవంత్ రెడ్డి కూడా ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు.

Kishan Reddy : కేసీఆర్ మీద కోపంతోనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మీద కోపంగా ఉన్న ప్రజలు గ్యారెంటీలతో పేరుతో ఆకర్షించిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పూర్తిగా లేదని మరోసారి స్పష్టమవుతోందన్నారు. కచ్చితంగా రానున్న రోజుల్లో బీజేపీని గ్రామస్థాయిలో నిర్మాణం చేసేందుకు వచ్చే ఏడాదంతా సంస్థాగతంగా సమయం ఇచ్చి అందరం కూడా పర్యటిస్తామన్నారు. రానున్న రోజుల్లో గ్రామ, మండల, జిల్లా కమిటీలు కొత్త శక్తితో ఏర్పాటు చేసుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక, బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసుకునే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.

హైడ్రానా.. హై డ్రామానో తెలియటం లేదు. అక్రమ నిర్మాణాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకు ఆపలేదు? గతంలో‌ ఏ ప్రాతిపాదికన అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు ఏ ప్రాతిపదికన కూల్చుతున్నారు? హైడ్రా చిత్తశుద్ధిపై ప్రజలకు అనుమానాలున్నాయి. కూల్చివేతలపై ప్రభుత్వం సమగ్రమైన కార్యాచరణ తీసుకోవాలి. ఆక్రమణల నుంచి చెరువులు, పార్కులు, మైదానాలను కాపాడాలి. కమిషన్ల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు.

సచివాలయం ముందు ఎవరి విగ్రహం పెడతామో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్తాం. బీజేపీ అధికార ప్రతినిధిగా మారారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. రేవంత్ రెడ్డి కుట్ర. కేసీఆర్ కాంగ్రెస్ లో రాజకీయ జీవితం ప్రారంభించారు. అలా అని కేసీఆర్ కాంగ్రెస్ జెండా కప్పుకుని చనిపోతారా? తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిని జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది. నేను పార్టీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్న మాట వాస్తం. అధ్యక్షుడి మార్పు సహజంగా జరిగే ప్రక్రియ.

రైతు రుణమాఫీపై వాస్తవాలను ప్రభుత్వం ప్రజల ముందు పెట్టాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతాం. అధికారం పోయినా.. బీఆర్ఎస్ వ్యవహారంలో మార్పు రాలేదు. ప్రజలదే తప్పు అన్నట్లు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోంది. అహంకారం వలనే ఓడామని కేసీఆర్ కుటుంబం తెలుసుకోలేకపోతోంది. కేసీఆర్ మాదిరి‌… రేవంత్ రెడ్డి కూడా ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు. పదవులకు రాజీనామా చేయించకుండానే ఎమ్మెల్యేలను రేవంత్ చేర్చుకుంటున్నారు.

Also Read : మహిళా కమిషన్ వర్సెస్ కాంగ్రెస్ నేత..! చిచ్చు రాజేసిన వేణుస్వామి వ్యవహారం..!

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. తెలంగాణకు ఏమీ చేయలేదంటూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కేంద్రాన్ని బద్నాం చేస్తున్నాయి. కశ్మీర్ ఎన్నికల్లో గెలిచి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం” అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

 

 

ట్రెండింగ్ వార్తలు