Asian Scientist: ఏషియన్ సైంటిస్టులు 100మందిలో చోటు దక్కించుకున్న హైదరాబాద్ ఫ్యాకల్టీ సురజిత్ ధార

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తూ.. పరిశోధనల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన డాక్టర్ సురజిత్ ధారకు...

Asian Scientist: ఏషియన్ సైంటిస్టులు 100మందిలో చోటు దక్కించుకున్న హైదరాబాద్ ఫ్యాకల్టీ సురజిత్ ధార

Asian Scientist

Updated On : May 2, 2021 / 7:58 AM IST

Asian Scientist: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తూ.. పరిశోధనల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన డాక్టర్ సురజిత్ ధారకు ది ఏషియన్‌ సైంటిస్ట్‌ 100 జాబితాలో చోటు దక్కింది. 2016 నుంచి ఏషియన్ సైంటిస్ట్ మ్యాగజైన్ ఏషియా మోస్ట్ అవుట్ స్టాండింగ్ రీసెర్చర్లను ఎంపిక చేస్తూ వస్తుంది.

సైంటిఫిక్ డిసిప్లిన్, ప్రాంతాల వారీగా సక్సెస్ సాధించిన వారిని పరిగణనలోకి తీసుకుంటూ ఈ లిస్టు రెడీ చేస్తారు. ఈ ఘనత సాధించిన వారికి రీసెర్చ్ లో జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి ప్రైజ్ లు దక్కుతాయి. దాంతో పాటే వారు ప్రత్యేకమైన సైంటిఫిక్ డిస్కవరీ లేదా అకాడమీలో చక్కని నాయకత్వం కనబరుస్తూ ఉండాలి.

సురజిత్.. సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు చేస్తున్నారు. కాగా గతేడాది ప్రముఖ శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డును సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో అందుకొన్నారు.

వీటితో పాటు స్వర్ణ జయంతి ఫెలోషిప్‌ అవార్డు(2015), హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి ఛాన్సిలర్ అవార్డు(2013), ఎన్‌ఎస్‌ సత్య మూర్తి మెమోరియల్‌ అవార్డును ఫిజిక్స్‌ ఫర్‌ యంగ్‌ సైంటిస్ట్‌గా(2012), ఇంటర్నేషనల్‌ లిక్విడ్‌ క్రిస్టల్‌ సొసైటీ ద్వారా మిచి-నకట ప్రైజ్‌లను(2010)లో అందుకొన్నారు.