Uttam kumar reddy: టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ కుమార్ రెడ్డి రాజీనామా ప్రకటించనున్నట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికల్లో కేవలం రెండు డివిజన్లలో మాత్రమే గెలుపు సాధించిన కాంగ్రెస్ పార్టీ విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకుంటున్నారా.. లేదంటే గత కొంతకాలంగా తప్పుకోవాలని భావిస్తున్న ఉత్తమ్ ఇదే సరైన సమయం అనుకుంటున్నారా అనేది చూడాలి.
ఏదేమైనా గ్రేటర్ ఎన్నికల ఫలితాల ప్రభావం అన్ని రాజకీయ పార్టీలపైనా గట్టి ప్రభావమే కనబరిచింది. బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రూపుదిద్దుకునే అవకాశం కనిపిస్తుండగా, ఆ పార్టీ కార్యకర్తలంతా సంబరాల్లో మునిగిపోయారు. చివరి వరకూ ఎంఐఎం హోరాహోరీగా పోరాడిన బీజేపీ.. చివర్లో టీఆర్ఎస్ కు చేరువైంది.
ఫలితంగా మేయర్ పీఠాన్ని అధీష్టించే క్రమంలో టీఆర్ఎస్ ఎక్స్ అఫీషియో ఓట్లను వాడుకుంటుందా లేదంటే.. ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటుందా అనే చర్చనీయాంశమైంది. కాసేపట్లో టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి బాధ్యతపై ఉత్తమ్ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.