vaccination resuming in telangana
Vaccination Resuming in telangana: తెలంగాణలో నిలిచిపోయిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం కానుంది. వ్యాక్సిన్ కొరత కారణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆదివారం నిలిపివేసింది. అయితే అధికారికంగా ప్రకటించకుండా ఆదివారం సెలవు కావున వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేసినట్లు ప్రకటించింది.
రాష్ట్రంలో ఈ రోజు(19 ఏప్రిల్ 2021) నుంచి వ్యాక్సినేషన్ తిరిగి కొనసాగిస్తామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి 2.7 లక్షల టీకాలు రావడంతో టీకా వేసే కార్యక్రమం తిరిగి ప్రారంభిస్తున్నారు.
తెలంగాణలో కరోనా టీకా నిల్వలు తగ్గిపోవడంతో వ్యాక్సినేషన్‌కు ఒకరోజు బ్రేక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కాగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడైనా టీకాలు ఉంటే నిర్ధేశించిన వయసుల ప్రకారం లబ్ధిదారులు టీకా వేయించుకోవచ్చని అధికారులు తెలిపారు.