Kothagudem : కొత్తగూడెం బంద్..ఉద్రిక్తత, వనమా రాఘవేంద్ర ఎక్కడ ?
వనమా రాఘవేంద్రను అరెస్ట్ చేసి రౌడీషీట్ ఓపెన్ చేయాలన్న డిమాండ్‌తో కొత్తగూడెం నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చాయి విపక్ష పార్టీలు.. బంద్‌లో బీజేపీ, కాంగ్రెస్, సీపీఐతో పాటు...

Kothagudem
Vanama Raghavendra Rao : కొత్తగూడెం నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అఖిలపక్షం బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వనమా రాఘవను అరెస్టు చేసి రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు రోడ్లపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో నేతల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. ఆందోళన చేపడుతున్న నాయకులను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరోవైపు వనమా రాఘవేంద్ర ఆచూకీ మాత్రం తెలియడం లేదు. వారం రోజులుగా ఎక్కడున్నాడు? ఇప్పుడీ ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఉన్నారు పోలీసులు. రామకృష్ణ దంపతుల ఆత్మహత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్రను అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారింది. అతని ఆచూకీ కోసం 8 బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు.. త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వనమా కోసం గాలింపు కొనసాగుతోంది.
Read More : Maharashtra : కరోనా కల్లోలం, 338 మంది రెసిడెంట్ వైద్యులకు పాజిటివ్
మరోవైపు వనమా రాఘవేంద్రను అరెస్ట్ చేసి రౌడీషీట్ ఓపెన్ చేయాలన్న డిమాండ్‌తో కొత్తగూడెం నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చాయి విపక్ష పార్టీలు.. బంద్‌లో బీజేపీ, కాంగ్రెస్, సీపీఐతో పాటు ప్రజా సంఘాలు పాల్గొంటున్నాయి. బంద్ నేపథ్యంలో పాల్వంచ, కొత్తగూడెంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. బాధిత కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే కుమారుడు కారణమన్న ఆరోపణలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఎమ్మెల్యే కొడుకు అయి ఉండి.. ఇంత నీచానికి పాల్పడుతాడా అంటూ విమర్శల వర్షం కురుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఏకంగా ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు విపక్ష పార్టీల నేతలు.
Read More : Nithin : హీరో నితిన్ వైఫ్‌కి కరోనా.. దూరం దూరంగా బర్త్‌డే సెలబ్రేషన్స్
పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న రాఘవేంద్ర.. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అదే జరిగితే దానికి ధీటుగా కౌంటర్ ఫైల్ చేస్తామన్నారు. పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో వనమా రాఘవేంద్రపై ఐసీపీ 302, 306, 307 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో రాఘవేంద్రను అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేం లేదని కొట్టిపడేశారు పోలీసులు.
Read More : Kerala : వింత వింత సైజుల్లో కోడిగుడ్లు పెడుతున్న కోడిపెట్ట..తెల్లసొన మాత్రమే ఉంటుంది
మరోవైపు వనమా రాఘవేంద్రపై ఆరోపణలు రావడంతో ఆయన తండ్రి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ రాశారు. పోలీసులకు, న్యాయవ్యవస్థకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని.. రాఘవేంద్రను నియోజకవర్గానికి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నానని లేఖలో వెల్లడించారు. తన కుమారుడు రాఘవేంద్రను పోలీసులకు అప్పగించేందుకు సహకరిస్తానన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దృష్టికి రామకృష్ణ ఆత్మహత్య కేసును తీసుకువెళ్లారు అధికారులు. వనమా కొడుకు రాఘవ నిర్వాకంపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోరారు సీఎం. సూసైడ్ కేసుకు సంబంధించి పూర్తి వాస్తవాలు తెలుసుకోవాలని ఖమ్మం జిల్లా నేతల్ని ఆదేశించారు కేసీఆర్.