Kerala : వింత వింత సైజుల్లో కోడిగుడ్లు పెడుతున్న కోడిపెట్ట..తెల్లసొన మాత్రమే ఉంటుంది

అంతకుముందు బాగానే కోడి గుడ్లు పెట్టేదని..కొద్ది రోజులుగా చిన్న చిన్న సైజులో గుడ్లు పెడుతోందని కోడి యజమాని సమద్ తెలిపారు...

Kerala : వింత వింత సైజుల్లో కోడిగుడ్లు పెడుతున్న కోడిపెట్ట..తెల్లసొన మాత్రమే ఉంటుంది

Kerala eggs

Eggs In The Size Of Grapes : అదేంటి చిన్న సైజు గుడ్లులాగా ఉన్నాయి. పక్కనే పెద్దగా ఉన్న గుడ్డు ఉన్నది ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారు. ఇవి ఓ కోడిపెట్ట పెట్టిన గుడ్లు. వింత వింత సైజుల్లో గుడ్లు పెడుతోంది. ఐదేళ్ల వయస్సున్న ఈ పెట్ట…ద్రాక్ష పండంత సైజులో కోడిగుడ్లు పెడుతోంది. బుజ్జి బుజ్జిగా ఒకటి..మరొకటి పెద్ద సైజులో ఈ గుడ్లున్నాయి. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఈ గుడ్లలో కేవలం తెల్లసొన మాత్రమే ఉంటోంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More : Kazakhstan : ఎల్పీజీ ధరల పెంపు నిరసనలు హింసాత్మకం..18 మంది పోలీసుల మృతి

కేరళ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతకుముందు బాగానే కోడి గుడ్లు పెట్టేదని..కొద్ది రోజులుగా చిన్న చిన్న సైజులో గుడ్లు పెడుతోందని కోడి యజమాని సమద్ తెలిపారు. ఇంట్లో ఉన్న మిగతా కోళ్లకు ఏ ఆహారం పెడుతున్నామో..అదే ఆహారం ఈ కోడిపెట్టకు కూడా పెడుతున్నామన్నారు. అయినా..వింత వింత సైజులో ఇప్పటి దాక 9 గుడ్లు పెట్టిందన్నారు. చిన్న గుడ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో…వాటిని చూసేందుకు జనాలు సమద్ ఇంటికి వస్తున్నారు.