Viral Video: వేగంగా దూసుకెళ్తున్న బైకుపై నిలబడి యువకుడి స్టంట్లు.. చివరకు..

అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల విలువైన ప్రాణాలు పొగొట్టుకోవద్దని పోలీసులు ఎంతగా సూచిస్తున్నా ఇటువంటి ఘటనలు పదే పదే చోటుచేసుకుంటున్నాయి.

Viral Video: వేగంగా దూసుకెళ్తున్న బైకుపై నిలబడి యువకుడి స్టంట్లు.. చివరకు..

Viral Video

Updated On : October 1, 2023 / 6:17 PM IST

VC Sajjanar: వేగంగా దూసుకెళ్తున్న బైకుపై నిలబడి ఓ యువకుడు స్టంట్లు చేశాడు. చివరకు దానిపై నుంచి పడి గాయాలపాలయ్యాడు. అంతేగాక రోడ్డుపై వెళ్తున్న మరో బైకర్ ను ప్రాణాపాయ స్థితిలోకి తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

తలకెక్కిన వెర్రి ఇది అని విమర్శలు గుప్పించారు. అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల విలువైన ప్రాణాలు పొగొట్టుకోవద్దని పోలీసులు ఎంతగా సూచిస్తున్నా ఇటువంటి ఘటనలు పదే పదే చోటుచేసుకుంటున్నాయి.

రోడ్డుపై తాము చేస్తున్న స్టంట్ల వల్ల ఇతర వాహనాలకు కూడా ప్రమాదం జరుగుతుందన్న విషయాన్నీ పట్టించుకోకుండా కొందరు యువకులు రెచ్చిపోతున్నారు. అనేక రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డవుతున్నాయి. వాటిని చూపిస్తూ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.