Vikarabad Girl Case (2)
Vikarabad Girl Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన వికారాబాద్ జిల్లా బాలిక కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. పుడూరు మండలం అంగడిచిట్టంపల్లి గ్రామంలో మైనర్ బాలిక హత్యకు సంబంధించి కేసు నమోదు చేసినట్టు పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నాం అన్నారు. కాగా, హత్యాచారం జరిగిందా లేదా అనేది ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుందని డీఎస్పీ చెప్పారు. ప్రస్తుతం ఈ కేసుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Vikarabad : పదో తరగతి బాలికపై అత్యాచారం? హత్య
వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పుడూరు గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలికపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. సోమవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోటానికి బహిర్భూమికి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోటంతో కుటుంబ సభ్యులు ఆమె గురించి వెతకసాగారు.(Vikarabad Girl Case)
Gang Rape In Uttar Pradesh : భర్తను చెట్టుకు కట్టేసి, వివాహితపై గ్యాంగ్ రేప్
ఇంతలో నిర్మానుష్యమైన ప్రాంతంలో బాలిక మృతదేహం లభించింది. వెంటనే వారు సంబంధిత పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలికను అత్యాచారం చేసి హత్య చేశారనే వార్త స్థానికంగా సంచలనం రేపింది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అసలేం జరిగింది? అనేది మిస్టరీగా మారింది. ఈ ఘాతుకానికి పాల్పడింది? ఎవరు అనేది తెలియాల్సి ఉంది. బాలిక కేసులో మిస్టరీని చేధించే పనిలో పోలీసులు ఉన్నారు.(Vikarabad Girl Case)
Instagram Private Photos : భర్త అనుకుని సోషల్ మీడియాలో చాటింగ్…ప్రైవేట్ ఫోటోలు అడిగే సరికి…!
కాగా, ఊరి బయటకు వెళ్లిన బాలికను గుర్తు తెలియని యువకుడు హత్య చేశాడని స్థానికులు చెబుతున్నారు. రాయితో మోది బాలికను చంపేసిన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాలిక కుటుంబ సభ్యులు ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను ప్రేమ పేరుతో వేధించేవాడని, అతడు, అతడి స్నేహితుల బాలిక మృతికి కారణమని ఆరోపించారు. మొత్తంగా బాలిక మరణం మిస్టరీగా మారింది. బాలికను అత్యాచారం చేసి హత్య చేశారా? లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు జరుపుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక దారుణ హత్యకు గురి కావడం స్థానికులను షాక్ కి గురి చేసింది. ఆడపిల్లకు రక్షణ కరువైందని వాపోతున్నారు. ఇంటి నుంచి వెళ్లిన అమ్మాయి.. తిరిగి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తుందో రాదోనని భయాందోళన చెందుతున్నారు.