మృత్యుబావి : ఇద్దరి కోసం గాలింపు..కుటుంబసభ్యుల్లో ఆందోళన

  • Published By: madhu ,Published On : October 28, 2020 / 07:39 AM IST
మృత్యుబావి : ఇద్దరి కోసం గాలింపు..కుటుంబసభ్యుల్లో ఆందోళన

Updated On : October 28, 2020 / 10:47 AM IST

warangal jeep Rams Into Well 2 Missing : వరంగల్‌ జిల్లా గవిచర్ల బావిలో జీపు పడిన ఘటనలో…మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. ఘటన జరిగి గంటలు గడిచిపోతున్నాఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది.



క్షేమంగా రావాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. సంగెం మండలం గవిచర్ల శివారులోకి వచ్చిన వెంటనే ఓ ప్యాసింజర్ జీపు అదుపుతప్పి బావిలో పడింది. ప్రమాదం జరిగిన సమయంలో జీపులో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నారు. గమనించిన స్థానికులు…బావిలో నుంచి 12 మందిని బయటికి తీసి రక్షించారు.



https://10tv.in/warangal-migrants-death-mystery/
మిగతా ముగ్గురు గల్లంతవగా..వారి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించారు. డ్రైవర్ మృతదేహాన్ని అతికష్టం మీద బయటకు తీశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అయితే జీపు పైన ఎలాంటి సేఫ్టీ వాల్ లేకపోవడం, ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండి ఉండటంతో పడటంతోనే అందరూ నీట మునిగారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు..పోలీసులకు సమాచారమిచ్చి 12 మందిని రక్షించారు. అయితే..డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.