Telangana Lockdown : తెలంగాణలో వీకెండ్ లాక్ డౌన్!

Telangana Lockdown 2
lockdown తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే కరోనా కట్టడికి కోసం నైట్ కర్ఫ్యూ వంటి అనేక చర్యలు చేపుడుతోన్న విషయం తెలిసిందే. అయితే, కొద్ది రోజుల క్రితం కరోనాబారిన పడి తిరిగి కోలుకొని ఇవాళ ప్రగతిభవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్..కరోనా కట్టడి చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
నైట్ కర్ఫ్యూ పెట్టినప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో..తెలంగాణలో వీకెండ్ లాక్ విధించే దిశగా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. వీకెండ్ లాక్ డౌన్ పై హైకోర్టు ఆదేశాలపై కూడా ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు సమాచారం. సమీక్ష తర్వాత రాష్ట్రంలో వారాంతపు లాక్ డౌన్ పై ప్రకటన రానున్నట్లు సమాచారం.