Harish Rao : రైతుబంధు ఎప్పుడిస్తారు? : హరీశ్ రావు

వడ్లపై రూ.500 బోనస్ ఏమైందని ప్రశ్నించారు. రైతాంగం ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తోందన్నారు.

HARISH RAO

Harish Rao – Rythu Bandhu : రైతుబంధు ఎప్పుడిస్తారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. రైతుల పక్షాన అడుగుతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రైతుబంధు డబ్బులు డిసెంబర్ 9న ఇస్తామన్నది కాంగ్రెస్ వారేనని స్పష్టం చేశారు. రైతాంగం ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తోందన్నారు.

వడ్లను బోనస్ తో కొనుగోలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారని తెలిపారు. వడ్లపై రూ.500 బోనస్ ఏమైందని ప్రశ్నించారు. తుఫాన్ తో కొన్ని చోట్ల వడ్లు తడిశాయని, వారినీ ఆదుకోవాలన్నారు. రైతులకు రైతుబంధు డబ్బులు రూ.15 వేలు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార లేక ప్రతిపక్షమైనా తాము ఎప్పటికీ ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు.

BRS Leader KTR : మాకోసం మరో తేదీని కేటాయించండి.. శాసనసభ కార్యదర్శికి మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

తెలంగాణ నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. అసెంబ్లీలో ఎమ్మేల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకముందు తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్బరుద్దీన్ చే ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయించారు.

 

తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తైంది. డిసెంబర్ 14వ తేదీ వరకు సమావేశాలు వాయిదా పడ్డాయి. సమావేశాలు పున: ప్రారంభమైన తొలిరోజు అసెంబ్లీ స్పీకర్ ను ఎన్నుకుంటారు. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు.

ట్రెండింగ్ వార్తలు