Hyderabad Crime : చిన్న గొడవ.. క్షణికావేశంలో భర్తపై కత్తితో దాడి

క్షణికావేశంలో భర్తపై కత్తితో దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం..

Hyderabad Crime : చిన్న గొడవ.. క్షణికావేశంలో భర్తపై కత్తితో దాడి

Hyderabad Crime (3)

Updated On : November 9, 2021 / 1:36 PM IST

Hyderabad Crime : చిన్న గొడవ ఇంట్లో తీవ్ర విషాదం మిగిల్చింది. క్షణికావేశంలో భర్తపై కత్తితో దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా బుసిరెడ్డిగూడ గ్రామానికి చెందిన బుసిరెడ్డి మురళీధర్ రెడ్డి, మౌనిక దంపతులకు 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి తొమ్మిదేళ్ల బాబు ఉన్నాడు.

చదవండి : Hyderabad Crime : వంటిపై చిరిగిన బట్టలు.. పక్కనే బీరు బాటిల్.. అనుమానాస్పద స్థితిలో డ్యాన్సర్‌ మృతి

భార్యాభర్తలు ఇద్దరు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. డిగ్రీ పరీక్ష రాసేందుకు ఈ నెల 5తేదీన గుంటూరు వెళ్లిన మౌనిక.. 6వ తేదీన హైదరాబాద్ వచ్చింది. తను ఇంట్లో లేనిసమయంలో చుట్టుపక్కలవారికి చెడుగా చెప్పాడని తండ్రి మురళీధర్ రెడ్డి పై కుమారుడు తల్లికి ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపైనే భర్తతో గొడవకు దిగింది మౌనిక.

చదవండి : Hyderabad Crime : స్నేహితుడి భార్యపై అఘాయిత్యం.. వీడియోలు తీసి వెకిలి చేష్టలు

ఇద్దరి మధ్య గొడవ పెద్దదికావడంతో క్షణికావేశంలో భర్తపై కూరగాయలు కోసే కత్తితో దాడి చేసింది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. భర్తపై దాడి అనంతరం భార్య నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు ప్రారంభించారు.