భర్తను దుబాయ్ పంపించి ప్రియుడితో రాసలీలలు.. ఇటీవల ఇంటికొచ్చిన భర్తకు విషయం తెలియడంతో.. అసలు ట్విస్ట్ ఏమిటంటే..?

భార్య వివాహేతర సంబంధం కారణంగా భర్త ఆస్పత్రిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో

భర్తను దుబాయ్ పంపించి ప్రియుడితో రాసలీలలు.. ఇటీవల ఇంటికొచ్చిన భర్తకు విషయం తెలియడంతో.. అసలు ట్విస్ట్ ఏమిటంటే..?

Supari gang attack

Updated On : June 18, 2025 / 11:23 AM IST

Hyderabad: భార్య వివాహేతర సంబంధం కారణంగా భర్త ఆస్పత్రిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అమీర్‌పేట్‌కు చెందిన షేక్ ఒసామాకు ఏడాది కింద షైస్తా అనే మహిళతో వివాహం జరిగింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో కొన్నాళ్లు దుబాయ్ వెళ్లి సంపాదించాలని, తద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి సంతోషంగా ఉంటామని భర్తకు షైస్తా చెప్పింది. భార్య మటలువిని షేక్ ఒసామా కొద్దికాలం క్రితం దుబాయ్ వెళ్లాడు. అయితే, భర్త దుబాయ్ కు వెళ్లిన కొద్దిరోజులకే ఇక్కడే ఉన్న భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. షైస్తాకు సమీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.

 

ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన షేక్ ఒసామాకు భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసింది. దీంతో భార్య షైస్తాను నిలదీశాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. గొడవ తరువాత భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్రియుడితో కలిసి షైస్తా ప్లాన్ వేసింది. ఇందుకోసం ప్రియుడితో కలిసి ఒసామాను చంపించేందుకు సుపారీ గ్యాంగ్ ను కలిసింది. వారు అడిగినంత డబ్బు ఇచ్చేందుకు వారు ఒప్పకున్నారు. దీంతో సుపారీ గ్యాంగ్ సోమవారం రాత్రి షేక్ ఒసామాపై దాడిచేశారు. కత్తులతో పొడిచి తీవ్రంగా గాయపర్చారు. అతను అపస్మారక స్థితికి వెళ్లడంతో చనిపోయాడని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని తీవ్రగాయాలతో పడిఉన్న షేక్ ఒసామాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఒసామా ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి ఆరాతీయగా.. భార్య ప్రియుడితో కలిసి భర్తను అడ్డుగ తొలగించుకోవాలని ప్లాన్ వేసిందని గుర్తించారు.