Mumbai Rains : ఓ వైపు ఎల్‌నినో ముప్పు.. మరోవైపు ముంబైలో రికార్డు వర్షాలు ఎందుకు?.. నిపుణులు చెప్పిన విస్తుపోయే వాస్తవాలు
Mumbai Rains : భారతదేశంపై ఓ వైపు ఎల్‌నినో ప్రభావం చూపుతుండగా.. మరోవైపు ముంబైలో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతుండటం పట్ల కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఈ విచిత్రమైన వాతావరణ వరణ పరిస్థితులపై వాతావరణ శాఖ అధికారులు కీలక విషయాలను వెల్లడించారు.
Mumbai Rains
Mumbai Rains : వాతావరణ పరిస్థితులు అంతకంతకు అధ్వానంగా మారుతున్నాయి. నిపుణులు తీవ్రస్థాయి సూపర్ ఎల్‌నినో ముప్పు పొంచి ఉందంటూ హెచ్చరిస్తున్నారు. ఇండియా ఇప్పటికే దాని ప్రతికూల ప్రభావాలకు గురవుతోంది. సాధారణంగా ఎల్‌నినో ప్రభావం ఉన్న సంవత్సరాల్లో భారతదేశంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడటం, వర్షపాతం తగ్గడం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఆ పరిస్థితి కనిపిస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో అందుకు విరుద్ధంగా ఉంది. ఎల్‌నినో ప్రభావం కొనసాగుతున్నప్పటికీ ముంబైలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వాతావరణంలో మార్పులేనని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read : USA vs Iran War : మళ్లీ మొదలైన యుద్ధం.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. ఆయిల్ ధరలకు రెక్కలు?
ప్రస్తుతం ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జూలై 1 నుంచి 7వ తేదీ మధ్య భారత వాతావరణ శాఖకు చెందిన కొలాబా వాతావరణ కేంద్రంలో 791 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఆ కేంద్రానికి జూలై నెల మొత్తం సగటు వర్షపాతం 768.5 మిల్లీమీటర్లను ఇప్పటికే అధిగమించింది. అదే సమయంలో శాంటాక్రూజ్ వాతావరణ కేంద్రంలో 879 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, ఆ కేంద్రం జూలై నెల సగటు 919.9 మిల్లీమీటర్లకు చేరువైంది. అయితే, ఒకవైపు ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ ముంబైలో రికార్డు స్థాయిలో వర్షాలు నమోదు కావడానికి కారణాలపై వాతావరణ శాఖ అధికారులు కీలక విషయాలను వెల్లడించారు.
నిపుణుల వివరాల ప్రకారం.. ఎల్‌నినో కారణంగా నైరుతి రుతుపవనాలరాక ఆలస్యమైనప్పటికీ, అరేబియా సముద్రం అసాధారణంగా వేడెక్కడం వల్ల అక్కడి నుంచి భారీగా తేమ వాతావరణంలోకి చేరుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడన వ్యవస్థ ఏర్పడటంతో రెండు సముద్రాల నుంచి తేమ ఒకేసారి అందుబాటులోకి వచ్చింది. దీంతో మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ మేఘాలు ఏర్పడి ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో గతంతో పోలిస్తే వర్షాల స్వభావం కూడా మారుతోందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గతంలో వర్షాలు చాలా రోజుల పాటు మోస్తరుగా కురిసేవి. ఇప్పుడు మాత్రం తక్కువ రోజుల్లోనే అత్యంత భారీ వర్షపాతం నమోదవుతోంది. అందుకే ఎల్‌నినో ఉన్నప్పటికీ ఒక్కోసారి రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయని వారు వివరిస్తున్నారు.
ముంబైలో ఈసారి వర్షాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, ఒకసారి రుతుపవనాలు చురుకుగా మారిన తర్వాత వరుసగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమవగా, రవాణా సేవలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా ముంబై – పుణె మార్గంలోని కర్జత్-లోనావాలా ఘాట్ సెక్షన్ లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రధాన నగరాలు పూర్తిగా జలమయంగా మారియి. బుధవారం కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నగర ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, భవిష్యత్తులో కూడా ఎల్‌నినో, వాతావరణంలో మార్పులను కలిసి వర్షాల తీరు మరింత అనిశ్చితంగా మార్చే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు, మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే పరిస్థితులు పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
