Wife Kills Husband : భర్త చేతులను చీరతో కట్టేసి.. దారుణానికి పాల్పడిన భార్య.. చిన్నకుమారుడు కేకలు వేయడంతో స్థానికులొచ్చి చూడగా..
Wife Kills Husband : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య.. భర్త చేతులను చీరతో కట్టేసి చంపేసింది.
Wife Kills Husband
- మహబూబ్ నగర్ జిల్లాల్లో దారుణ ఘటన
- భార్య వివాహేతర సంబంధం..
- చీరతో చేతులు కట్టేసి భర్తను నరికి చంపిన భార్య
Wife Kills Husband : వివాహేతర సంబంధం ఓ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది. కడదాకా తోడుగా ఉండాల్సిన భార్యే భర్తను కిరాతకంగా హత్య చేసింది. ప్రియుడు మోజులోపడి ఆనందంగా జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. భార్య వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న భర్త.. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించినా ఆమెలో ఎలాంటి మార్పురాలేదు.. పైగా భర్తపై కోపం పెంచుకుంది. ఈ క్రమంలో రాత్రివేళ పిలులు నిద్రిస్తుండగా.. భర్త చేతులను చీరతో కట్టేసి నరికేసింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.. ఈ దారుణ ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
Also Read : Rythu Bharosa : మధిరలో ‘రైతు భరోసా’ సభ రద్దు.. నిధుల విడుదలపై రేవంత్ సర్కార్ క్లారిటీ..
బస్వాయపల్లి గ్రామానికి చెందిన కొమ్మూరు నాగేశ్ (38)కు కొయిలకొండ మండలం మల్కాపూర్ కు చెందిన కవితతో 17ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే, కొంతకాలంగా కవిత వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త నాగేశ్‌కు తెలియడంతో కవితను మందలించాడు. తప్పుడు పనిని మానుకోవాలని హెచ్చరించాడు. అయినా కవితలో మార్పురాలేదు. దీంతో విషయాన్ని గ్రామంలోని పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు పంచాయితీ పెట్టి కవితను మందలించారు. తప్పుడు పద్దతి మానుకోవాలని సూచించారు. అయినా కవిత తన పంథాను మార్చుకోకపోగా.. భర్తపై కక్ష పెంచుకుంది.
భార్య ప్రవర్తనలో ఎంతకీ మార్పురాకపోవడంతో నాగేశ్ మద్యానికి బానిసయ్యాడు. ప్రతీరోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. దీంతో భార్యతో ప్రతిరోజూ గొడవకుదిగేవాడు. భర్తను హత్యచేయాలని భావించిన కవిత.. ఆదివారం రాత్రి కుమారులు నిద్రిస్తున్న సమయంలో నాగేశ్ చేతులను చీరతో మంచానికి కట్టేసి కత్తితో నరుకుతుండగా చిన్న కుమారుడు గమనించి కేకలు వేశాడు.
ఇంట్లో నుంచి భారీ శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వారిగా తలుపులు పగలగొట్టి చూడగా.. నాగేశ్ రక్తపు మడుగులో పడిఉన్నాడు. తీవ్రగాయాలపాలైన నాగేశ్‌ను స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం నగేశ్ మృతిచెందాడు. మృతుడి సోదరుడు రాజప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
