cheruku srinivas reddy : చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ (Congress) లో చేరుతారా అనేది ఇప్పుడే చెప్పలేనన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్.. దుబ్బాక అభ్యర్థిపై 2020, అక్టోబర్ 06వ తేదీ మంగళవారం క్లారిటీ ఇస్తామన్నారు. చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి TRS ను వీడి కాంగ్రెస్‌లో చేరబోతున్నారని తెగ ప్రచారం జరిగింది.
గత ఎన్నికల సమయంలో తండ్రి ముత్యంరెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌లో చేరారు శ్రీనివాస్‌రెడ్డి. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ టికెట్ ఆశించిన శ్రీనివాస్‌రెడ్డి భంగపడ్డారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించారని సమాచారం. కానీ..ఆయన పార్టీలో చేరుతారా ? లేదా ? అనేది ఇప్పుడే చెప్పలేమని ఉత్తమ్ చెప్పడంతో సందిగ్ధత నెలకొంది.
మరోవైపు…దుబ్బాక అభ్యర్థి పేరును మంగళవారం ప్రకటిస్తామని ఉత్తమ్ తెలిపారు. టికెట్ కొత్త వ్యక్తికా లేదా పాత వారికా అనేది పార్టీలో చర్చిస్తున్నామని.. పార్టీ ఇంచార్జితో కూడా చర్చలు జరిపి తుది పేరు ప్రకటిస్తామన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ప్రొఫెసర్ కోదండరామ్, చెరుకు సుధాకర్ మద్దతు అడిగారని.. పార్టీలో చర్చించి నిర్ణయం తెలుపుతామని ఉత్తమ్ అన్నారు.
దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
దుబ్బాకతో పాటు దేశవ్యాప్తంగా 54 అసెంబ్లీ నియోజవకర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించి అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారీ చేస్తారు.
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 16.
నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 19 వరకు గడువు ఉంటుంది.
నవంబర్ 3న పోలింగ్ నిర్వహిస్తారు.
నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.