Sarpanch Navya : ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య ఆరోపణలు,సుమోటాగా తీసుకున్న మహిళా కమిషన్, ఆధారాలు ఇవ్వాలని పోలీసుల నోటీసులు

జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య మరోసారి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆరోపణలు చేశారు. తన భర్తను ట్రాప్ లో వేసి తనపై ఒత్తిడి తెస్తున్నారని తన భర్త, ఎమ్మెల్యే రాజయ్యవల్ల తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేయటంపై మహిళా కమిషన్ స్పందించింది. పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Sarpanch Navya : ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య ఆరోపణలు,సుమోటాగా తీసుకున్న మహిళా కమిషన్, ఆధారాలు ఇవ్వాలని పోలీసుల నోటీసులు

MLA Tatikonda Rajaiah..Sarpanch Navya

Updated On : June 24, 2023 / 3:43 PM IST

MLA Tatikonda Rajaiah..Sarpanch Navya : స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) BRS ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(MLA Tatikonda Rajaiah)పై జానకీపురం (Janakipuram)మహిళా సర్పంచ్ నవ్య (Sarpanch Navya)చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు  పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై రాజయ్య స్పందించి ఇవ్వన్నీ తప్పుడు ఆరోపణలు అని..తనపై కుట్ర జరుగుతోందని అంటూ వివరణ కూడా ఇచ్చారు. ఆ తరువాత రాజయ్య నవ్యకు క్షమాపణ చెప్పారని..తాను కూడా క్షమించానని చెప్పారు నవ్య.

ఈక్రమంలో మరోసారి నవ్య రాజయ్యపై మరోసారి ఆరోపణలు చేశారు. దీనిపై నవ్య 10టీవీతో మాట్లాడుతు..తన భర్త MLA రాజయ్య ట్రాప్ లోపడి తనను సంతకం పెట్టమంటు ఒత్తిడి తెస్తున్నాడంటు భర్తపైనే ఆరోపణలు చేశారు. మీరు ఆర్థికంగా దెబ్బతిని ఉన్నారనీ..గ్రామ అభివృద్ధి కోసం రూ.25లక్షలు ఇస్తున్నానని వ్యక్తిగతంతో మరో రూ.25లక్షలు ఇస్తానని దానికి కోసం తనను సంతకం పెట్టాలని తన భర్తతోనే చెప్పించారని ఆరోపించారు నవ్య. ‘‘ఇలా రాజయ్య ట్రాప్ లో పడ్డ తన భర్త పాతిక లక్షల కోసం ఆశపడుతున్నాడని.. ఆ డబ్బులు తీసుకుని  సర్పంచ్ గా తనను సంతకం పెట్టమని వేధిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పుడు రూ.పాతిక లక్షల తీసుకుని సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తున్న తన భర్త రేపు మరికొంత డబ్బు తీసుకుని తనను చంపమంటే చంపేస్తాడు కదా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నవ్య.

Telangana : ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగికంగా వేధిస్తున్నారు,చెప్పినట్లు వినాలని బెదిరిస్తున్నారు : మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు

తాను రాజయ్య ఇచ్చిన రూ.25లక్షలు తీసుకున్నానని..అందరు అడుగుతున్నారని కానీ నేను ఒక్క పైసా కూడా ముట్టుకోలేదని కానీ అందరు ఇలా అడుగుతుంటే భరించలేకపోతున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. నాకు అండగా ఉండాల్సిన నా భర్త కూడా రాజయ్య ట్రాప్ లో పడి నన్ను వేధిస్తున్నాడనీ…నాకు ప్రాణాహాని ఉందంటూ వాపోయారు. ఇక ఈ వేధింపుల్ని..తన భర్త చేసే ఒత్తిడిని భరించలేను అంటూ 10టీవీ ప్రతినిథి వద్ద కన్నీరు పెట్టుకున్నారు నవ్య. ఎమ్మెల్యే రాజయ్య పైనా, తన భర్తపైనా..ఎమ్మెల్యే చెప్పినట్లుగా వినాలని తనపై ఒత్తిడి చేస్తున్న మరో మహిళా నేతపైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ తెలిపారు నవ్య.

ఈక్రమంలో సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. నవ్య ఆరోపణలపై నిజానిజాలను విచారించాలని పోలీసులకు ఆదేశించింది.దీంతో పోలీసులు నవ్య కేసును సీరియస్ గా తీసుకున్నారు. నవ్య కుటుంబానికి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే రాజయ్య లైంగికంగా వేధిస్తున్నట్లుగా ఆధారాలు సమర్పించాలని నోటీసులు ఇచ్చారు. దీనిపై నవ్య దంపతులు కాస్త గడువు కోరారు. దీంతో సర్పంచ్ నవ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యవహారం మహిళా కమిషన్ వద్ద పెడింగ్ లో ఉంది.

BRS MLA Rajaiah-Sarpanch Navya: క్షమాపణలు చెప్పిన రాజయ్య.. ఎమ్మెల్యే, సర్పంచ్‌ నవ్య మధ్య సయోధ్య