Battista Hypercar In Hyderabad :హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుపోయే హైపర్ కారు..ధర రూ.18 కోట్లు..
ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుపోయే కారు భారతదేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ ఆవిష్కరించబడింది.ఫాస్టెస్ట్ పికప్ ఎలక్ట్రిక్ కార్ ‘బటిస్టా’(Battista Hypercar)...! జరుగుతున్న ఈ-మోటర్ షోలో ఇటలీలోని లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆటోమోబిలి పినిన్‌ఫారినా’.. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ-మోటర్ షోలో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ‘బటిస్టా’ కారును ఆవిష్కరించింది.

Battista Hypercar In Hyderabad
Battista Hypercar In Hyderabad : ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుపోయే కారు. గంటకు 60 మైళ్ల వేగంతో దూసుకెళ్లి 2022 నవంబర్ లో అగ్రస్థానానికి చేరుకున్న ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారుగా పేరు పొందింది. 1.86 సెకన్లలో 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు 4.75 సెకన్లలో 200 కిలో మీటర్ల వేగంతో దౌడ్ తీయనున్నది. అదే ఫాస్టెస్ట్ పికప్ ఎలక్ట్రిక్ కార్ ‘బటిస్టా’(Battista Hypercar)…! ఇన్ని ప్రత్యేకలు ఉన్న ఈ కారు హైదరాబాద్ లోనే కనువిందు చేస్తు ఆకట్టుకుంటోంది.
ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆటోమోబిలి పినిన్‌ఫారినా’(Automobili Pininfarina).. భారతదేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ-మోటర్ షోలో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ‘బటిస్టా’ కారును ఆవిష్కరించింది. ఫిబ్రవరి 11న (2023)ఈ షో హైదరాబాద్ లో నిర్వహించబడుతుంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు (mahindra and mahindra)చెందిన అనుబంధ సంస్థ ఇది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ హైపర్‌కార్ పినిన్‌ఫారినా బాటిస్టా.
ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆటోమోబిలి పినిన్‌ఫారినా’(Automobili Pininfarina).. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ-మోటర్ షోలో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ‘బటిస్టా’ కారును ఆవిష్కరించింది. ఇటలీలో తయారైన ఈ కారు ప్రపంచంలో ఫాస్టెస్ట్-యాక్సలరేటింగ్ ఎలక్ట్రిక్ కారు ఇదే కావటం విశేషం. దీని ధర సుమారు రూ.18 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 1.79 సెకన్లలో 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు 4.75 సెకన్లలో 200 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది.
ఈ కారు హైదరాబాద్ లో ఆవిష్కరించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్స్ అండ్ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ డైరెక్టర్ సుజయ్ కారంపురి మాట్లాడుతూ.. తెలంగాణకు మహీంద్రా గ్రూపుతో గొప్ప అనుబంధం ఉందని..ఎలక్ట్రిక్ మొబిలిటీలో ఇటువంటి అత్యాధునిక సాంకేతికతను పొందుతున్నందుకు గర్విస్తున్నామని తెలిపారు.