Yadadri Tickets Rates : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఛార్జీల పెంపు.. మరింత ప్రియం కానున్న లడ్డూ ప్రసాదం

తెలంగాణ ప్రముఖ వైష్ణవ క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారికి జరిపే నిత్యకైంకర్యములు, శాశ్వత పూజలతోపాటు, భోగములు, స్వామివారి ప్రసాదముల రేట్లను పెంచారు

Yadadri Tickets Rates

Yadadri Tickets Rates : తెలంగాణ ప్రముఖ వైష్ణవ క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారికి జరిపే నిత్యకైంకర్యములు, శాశ్వత పూజలతోపాటు, భోగములు, స్వామివారి ప్రసాదముల రేట్లను పెంచారు అధికారులు. కొన్ని రేట్లు 100 శాతం పెరగ్గా.. మరికొన్ని 20 నుంచి 80 శాతం రేట్లు పెరిగాయి. ఈ రేట్లు శుక్రవారం (డిసెంబర్ 10) నుంచి అమల్లోకి రానున్నాయి.

చదవండి : Yadadri Temple : యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. వాహనాలు కిందనే నిలిపేస్తున్న అధికారులు

పెరిగిన ధరలను ఒకసారి పరిశీలిస్తే..

నిజాభిషేకం (ఇద్దరికి) గతంలో రూ.500 నుంచి రూ.800 చేశారు. ఒక్కరికి రూ.250 ఉంటే ప్రస్తుతం రూ.400కు పెంచారు. సహస్ర నామార్చనకు రూ.216 నుంచి రూ.300, సుదర్శన నారసింహ హోమానికి రూ.1,116 నుంచి రూ.1,250, నిత్య కల్యాణోత్సవానికి రూ.1,250 నుంచి రూ,1,500, స్వాతి నక్షత్రం రోజున నిర్వహించే శత ఘటాభిషేకానికి (ఇద్దరికి) గతంలో రూ.750 ఉండగా రూ.1,000,

చదవండి : Yadadri Lakshmi Narasimha Swamy : చివరి ఆదివారం కావడంతో యాదాద్రికి పోటెత్తిన భక్తులు

లక్ష పుష్పార్చనకు రూ.2,116 ఉండగా రూ.2,500 చేశారు, వెండి మొక్కు జోడు సేవలకు రూ.500 ఉంటే రూ.700, సువర్ణ పుష్పార్చనకు రూ.516 ఉంటే రూ.600, వేదాశీర్వచనం రూ.516 ఉంటే రూ.600, ఆండాల్‌ అమ్మవారి ఊంజల్‌ సేవకు రూ.750 నుంచి రూ.1000కి పెంచారు, సత్యనారాయణస్వామి వ్రతాలు (సామగ్రితో కలిపి) రూ.500 నుంచి రూ.800 పెంచారు, గో పూజకు రూ.50 ఉంటే రూ.100.

చదవండి : Yadadri : విమాన గోపురానికి మంత్రి మల్లారెడ్డి విరాళాల సేకరణ, 11 కిలోల బంగారం

శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలకు వీఐపీల కోసం ప్రత్యేకంగా రూ.1,500, ఉపనయనం రూ.50 నుంచి రూ.500, ఉపనయనం ధర ఒక్కసారిగా పదిరెట్లు పెంచేశారు. అక్షరాభ్యాసం రూ.51 ఉంటే రూ.200, అష్టోత్తర పూజకు రూ.100 ఉంటే రూ.200, అన్నప్రాశన (ఐదుగురికి) రూ.500 ఉంటే రూ.1000కి పెంచారు.

చదవండి : Yadadri : బంగారు తాపడం కోసం..క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి విరాళం పంపిచొచ్చు

ప్రసాదం ధరల విషయానికి వస్తే..

స్వామివారి లడ్డూ ప్రసాదం ధరలను సైతం అధికారులు పెంచారు. వంద గ్రాముల లడ్డూ గతంలో రూ.20 ఉంటే రూ.30కి పెంచారు. 500 గ్రాముల లడ్డూ రూ.100 ఉంటే రూ.150, 250 గ్రాముల పులిహోర రూ.15 ఉంటే రూ.20, 250 గ్రాముల వడ రూ.15 ఉంటే రూ.20కి పెంచారు. శివాలయంలో, పాతగుట్ట ఆలయంలోనూ పూజల ధరలను పెంచారు. శాశ్వత పూజల ధరలు కూడా పెరిగాయి.