Yadadri : బంగారు తాపడం కోసం..క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి విరాళం పంపిచొచ్చు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి సంబంధించిన అధికారిక బ్యాంకు క్యూ ఆర్ కోడ్ ను బుధవారం ఆలయ ఈఓ గీత విడుదల చేశారు.

Yadadri : బంగారు తాపడం కోసం..క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి విరాళం పంపిచొచ్చు

Yadadri temple

Indian Bank QR Code : యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అందులో కీలకం..125 కేజీల బంగారంతో తిరుమల తరహాలో… యాదాద్రి గర్భగుడికి బంగారు తాపడం. ఇందుకు రూ.60 కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు ఖర్చు జరగొచ్చని ఇటీవలే సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రజలు విరాళంగా అందివ్వాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో…ప్రజలు సులువుగా విరాళాలు అందించేందుకు కొత్త విధానం తీసుకొచ్చారు ఆలయ నిర్వాహకులు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి సంబంధించిన అధికారిక బ్యాంకు క్యూ ఆర్ కోడ్ ను బుధవారం ఆలయ ఈఓ గీత విడుదల చేశారు.

Read More : Gold Biscuits Donation : తిరుమల శ్రీవారికి 3.604 కేజీల బంగారం బిస్కెట్లు విరాళం

ఇది యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఇండియన్ బ్యాంకుకు చెందిన క్యూ ఆర్ కోడ్ అని తెలిపారు. స్వామి ప్రధాన ఆలయంలోని విమాన గోపురం బంగారు తాపడానికి ప్రజలు..స్వామి వారి భక్తులు తమ మొబైల్ ద్వారా క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి విరాళం అందించొచ్చని తెలిపారు. తమకు తోచిన విధంగా సహాయం చేసి బంగారు తాపడం నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దాతలు బ్యాంకులకు నేరుగా రాకుండా…ఎక్కడి వాళ్లు అక్కడే విరాళం అందించే విధంగా ఈ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.