Hyderabad
Hyderabad : ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాగ్యలక్ష్మి కాలానికి చెందిన నాగరేవతి(20) అనే యువతి ఈ నెల 8న స్నేహితులను కలిసేందుకు బయటకు వెళ్ళింది. వెళుతూ వెళుతూ చింతల్‌లోని ఓ కళాశాలలో చదువుతున్న సోదరికి టిఫిన్ బాక్స్ కూడా పట్టుకెళ్లింది.
చదవండి : Hyderabad Crime : కేబుల్ వర్క్ చేయడానికొచ్చి పాడుపని.. చితకబాదిన స్థానికులు
అయితే మధ్యాహ్నం అయినా టిఫిన్ బాక్స్ రాకపోవడంతో నాగరేవతి సోదరి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాక్స్ రాలేదని తెలిపింది. దీంతో తండ్రి శ్రీను, తల్లి నాగసత్యవేణి.. కూతురుకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో గురువారం పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
చదవండి : Hyderabad Crime : భర్త బ్లౌజ్ సరిగా కుట్టలేదని భార్య ఆత్మహత్య