వీడిని ఏం చేసినా పాపం లేదు..! గాల్లోకి డబ్బులు విసురుతూ యూట్యూబర్ హల్‌చల్..

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, పబ్లిక్ లో న్యూసెన్స్ కు కారణం అవుతున్న ఇలాంటి వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలంటున్నారు.

Youtuber Harsha : వ్యూస్ కోసం, వైరల్ అవ్వడం కోసం కొందరు యూట్యూబర్లు రెచ్చిపోతున్నారు. శ్రుతి మించి వ్యవహరిస్తున్నారు. లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. పిచ్చి పిచ్చి చేష్టలతో రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ప్రజలను తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ యూట్యూబర్ బరితెగించాడు. తన వీడియోలకు వ్యూస్ కోసం గాల్లోకి డబ్బులు విసురుతూ రోడ్డుపై హల్ చల్ చేశాడు. ఆ కరెన్సీ నోట్ల కోసం జనం పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కూకట్ పల్లిలో హర్ష అనే యూట్యూబర్ ఓవర్ చేశాడు. నడిరోడ్డుపై ట్రాఫిక్ మధ్యలో గాల్లోకి డబ్బులు విసిరాడు. కరెన్సీ నోట్లను గాల్లోకి విసురుతూ బైక్ పై స్టంట్స్ చేశాడు. ఆ కరెన్సీ నోట్ల కోసం జనం పరుగులు తీశారు. దీనిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. హర్ష తీరుని వారు ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు అతడు దిగజారిపోయాడని సీరియస్ అవుతున్నారు.

Also Read : పచ్చని సంసారంలో చిచ్చు రేపిన లేడీ కానిస్టేబుల్

రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరేయడంతో, వాటి కోసం జనాలు పరుగులు పెడుతున్నారని, దీని వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు యూట్యూబర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వ్యూయర్స్ కు రివార్డ్స్ ఆఫర్ చేస్తూ వీడియోలు తీస్తున్న హర్షపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, పబ్లిక్ లో న్యూసెన్స్ కు కారణం అవుతున్న ఇలాంటి వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలంటున్నారు. లేదంటే ఇలాంటి వాళ్లను చూసి మరికొందరు తయారవుతారని వాపోయారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే పనులేవీ చేయొద్దని యూట్యూబర్లను కోరుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు